News

Mahesh Babu: మహేష్ బాబు 100సార్లు చూసిన ఆ ఫేవరెట్ సినిమా ఏంటో తెలుసా..?

మహేష్ సినిమా రిలీజవుతుందంటే తెలుగు నాట ఆ రోజు పండగ వాతావరణమే. ఇక థియేటర్‌ల దగ్గర ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ఫ్లెక్స్ లతో థియేటర్లను ముస్తాబుచేసి, టపాసులు, ఈలలు.. గోలలతో రచ్చ రచ్చ చేస్తుంటారు. అయితే తాజాగా సుధీర్ బాబు ‘హరోం హర’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. కాగా,ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న సాయంత్రం జరిగింది. ఇక ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, సుధీర్ బాబు సినిమాను ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చారు.

ఈక్రమంలోనే.. సుధీర్ బాబుతో కలిసి ఓ ఆడియో ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. అయితే ఇందులో సుధీర్ బాబు అడిగిన పలు ప్రశ్నలకి మహేష్ చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చారు. ఈ సందర్భంగా.. హరోం హర చిత్రంలో ఎక్కువగా గన్స్ ఉపయోగించడంతో ఇందుకు సంబంధించిన ప్రశ్న అడిగారు సుధీర్ బాబు. ‘మీకు ఇండస్ట్రీలో ఉన్న యాక్టర్స్ లో గన్స్ ను బాగా హ్యాండిల్ చేసిన మీ ఫేవరెట్ హీరో ఎవరు? అని మహేష్ బాబును అడిగారు. ఇక దీనికి సమాధానమిస్తున్న మహేష్ బాబు..

”సూపర్ స్టార్ కృష్ణగారే అని బదులు చెప్పారు. అంతేకాకుండా.. నేను మోసగాళ్లకి మోసగాడు సినిమా 100 సార్లు చూసుంటాను. నాన్న సినిమాల్లో నాకు చాలా ఇష్టమైన చిత్రం ఇదే.” అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ‘ఇకపోతే నిజం సినిమాలో కూడా ఎక్కువగా గన్ ఉపయోగించారు కదా ఆ అనుభవం ఎలా ఉంది అంటూ’ సుధీర్ బాబు అడిగారు. దానికి సమాధానమిస్తూ.. ”ఆ టైమ్‌లో నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో నిజం ఒకటి. ఒక్కడు తర్వాత ఆ చిత్రం చేశాను.

చాలా ఎమోషనల్, ఇంటెన్స్ సీన్స్ ఉన్న చిత్రం అది. అందులో ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు అయితే నాకు బాగా పేరు తెచ్చాయి. అంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు తేజ గారికి థ్యాంక్స్ చెప్పాలి” అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఇక హరోం హర సినిమా ట్రైలర్ బాగుందని.. ఖచ్చితంగా సినిమా మంచి విజయం సాధించాలని మహేష్ మూవీ టీం అంతటికి విష్ చేశారు. మరి, సుధీర్ బాబుతో మహేష్ బాబు చెప్పుకొచ్చిన ఆసక్తికర విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker