News

మగవారికి బంపరాఫర్, అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5 లక్షలు.

ఫేస్‌బుక్‌లో ఓ వ్యక్తి ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిలను ప్రెగ్నెంట్ చేస్తే రూ. 5లక్షల ఉద్యోగం ఇస్తానని ప్రకటన ఇచ్చాడు. ఈ ఆఫర్ చూసిన ఓ యువకుడు అతడిని సంప్రందించాడు. దీంతో ఆ యువకుడి నుంచి రిజిస్ట్రేషన్ పేరుతో రూ.24,800 కట్టించుకున్నాడు. అయితే సోషల్ మీడియాలో ఎన్నో అట్రాక్టివ్ జాబ్ ఆఫర్లు వైరల్ అవుతుంటాయి. ఏ పని చేయకుండానే ఇంటి నుంచే డబ్బులు సంపాదించండి అంటూ ప్రకటనలు ఇస్తుంటారు. ఇవి డ్రీమ్ జాబ్స్ అనిపిస్తాయి. అందుకే చాలామంది అప్లై చేసుకుంటారు. అలా అత్యాశకు పోయి నిలువునా మోసపోతుంటారు.

తాజాగా మగవారిని బాగా అట్రాక్ట్ చేసే ఒక విచిత్రమైన ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ధనవంతుల కుటుంబాలకు చెందిన యువతులను ప్రెగ్నెంట్ చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని కొందరు బంపరాఫర్ ప్రకటించారు. ఇలాంటి ఆఫర్‌ను చాలామంది మగవాళ్లు, ముఖ్యంగా యువకులు కాదనలేరు. ఈ విచిత్రమైన ప్రకటన చూసి ఒక యంగ్‌స్టర్ చాలా ఆసక్తి చూపించాడు. కానీ అతడికి తెలియని ఒక విషయం ఏంటంటే, ఇది సైబర్ క్రిమినల్స్‌ క్రియేట్ చేసిన ఒక ఫేక్ జాబ్ ఆఫర్ ఇది. మగవారిని ఈజీగా బుట్టలో వేసుకోవచ్చని ఇలాంటి టెమ్ట్ చేసే జాబ్ నోటిఫికేషన్ పోస్ట్ చేశారు. అది తెలియని యువకుడు వీరి చేతుల్లో నిండా మోసపోయాడు.

చివరికి చేసేదేమీ లేక ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌ సిటీలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల మౌ-ఐమా (Mau-Aima) పట్టణంలోని బకర్‌గంజ్ ఏరియాకు చెందిన అల్తాఫ్ అనే యువకుడు సోషల్ మీడియాలో ఒక ప్రకటన చూశాడు. ఆ అడ్వర్టైజ్‌మెంట్‌లో ధనవంతుల కుటుంబాలకు చెందిన అమ్మాయిలను గర్భవతి చేస్తే రూ.5 లక్షలు ఇస్తామని, అలానే ఇతర సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పారు. ఆ యాడ్‌లో ఒక ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. అల్తాఫ్ ఆ నంబర్‌కు ఫోన్ చేసి, ముందుగా రూ.800 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాడు. తర్వాత స్కామర్లు విదేశాలకు తీసుకెళ్లేందుకు పర్మిషన్ కావాలంటూ, పేపర్ వర్క్ పూర్తి చేయాలంటూ నమ్మబలికారు.

ఆ ప్రాసెస్‌కి డబ్బులు అవసరం అవుతాయని తెలిపారు. వాళ్ల మాటలు నమ్మి అల్తాఫ్‌ మరో రూ.24 వేలు ఇచ్చాడు. ఆ తర్వాత, స్కామర్లు అల్తాఫ్‌ని మళ్లీ సంప్రదించి, తమకు రూ. 3 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. దాంతో తాను మోసపోయానని అతడికి అర్థమైంది. రూ. 3 లక్షలు డబ్బు ఇవ్వడానికి నిరాకరించగా, వారు అతనిపై కేసు పెడతామని, జైలుకు పంపిస్తామని బెదిరించారు. తాము పోలీసు అధికారులమని నాటకాలు ఆడుతూ అతన్ని భయపెట్టారు. దీంతో అల్తాఫ్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ యువకుడి ఫిర్యాదు విని పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. ఇలాంటి ఉద్యోగ ప్రకటనలను నమ్మకూడదని ప్రజలను హెచ్చరించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker