Health

CCTV in Toilets: మహిళల బాత్రూమ్‌ లోపలికి వెళ్లిన వెంటనే చెక్ చేయండి, లేదంటే అంటే సంగతులు.

CCTV in Toilets: మహిళల బాత్రూమ్‌ లోపలికి వెళ్లిన వెంటనే చెక్ చేయండి, లేదంటే అంటే సంగతులు.

ప్రస్తుతం జరుగుతోన్న సంఘటనలు చూస్తుంటే గోడలకు చెవులు మాత్రమే కాదు కళ్లు కూడా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కొందరు కేటుగాళ్లు బాత్‌రూమ్స్‌లో, ట్రయల్‌ రూమ్స్‌లో సీక్రెట్‌ కెమెరాలను పెడుతూ రహస్యంగా చిత్రీకరిస్తున్నారు. అయితే సీక్రెట్ కెమెరాల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్రమత్తతతో వీటిని గుర్తించి జాగ్రత్త పడాలని చెబుతున్నారు.

వీటిని ఎక్కువగా వీటి వెనకనే ఉపయోగిస్తారని తెలిపారు. అద్దాల వెనక, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌లలో, తలుపులు, గోడ మూలల్లో, పైకప్పు సీలింగ్, బల్బులో, టిష్యూపేపర్ బాక్స్‌లో, స్మోక్ డిటెక్టర్‌లో, హుక్‌లలో, లైటింగ్ సిస్టమ్‌లలో చాలా చాకచక్యంగా దాచిపెట్టే అవకాశం ఉంది. కొన్నిసార్లు బకెట్‌లోనూ, బీచ్ బాగ్‌లోనూ కూడా కెమెరాలు పెట్టే అవకాశం ఉంది. బాత్రూమ్‌లోకి వెళ్లే మహిళలు ఇవి గమనించకుండానే వారి ప్రైవేటు వీడియోలు రికార్డ్ అవుతాయి.

Also Read: మన దేశంలో సగం మంది పురుషులు ఈ వ్యాధితో పదపడుతున్నారు.

ఇవి తరచూ ఇంటర్నెట్‌లో లీక్ అవుతూ, మహిళల గౌరవాన్ని, భద్రతను తీవ్రంగా దెబ్బతీయడమే కాకుండా, మానసికంగా దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాలను నివారించాలంటే, మహిళలు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బాత్రూమ్‌లోకి వెళ్లే ముందు అద్దాన్ని పరీక్షించాలి. డబుల్ మిరర్ ఉంటే, ఫింగర్ నెయిల్ టెస్ట్ చేయండి. అద్దానికి తేలికగా వ్రేలితో తాకినప్పుడు మీ వేళ్లు అద్దంలో కాస్తంత దూరంగా కనపడితే అది సేఫ్; లేకపోతే అనుమానించవచ్చు.

Also Read: ఈ బత్తాయి పండ్లు తిన్నాక, వీటిని అస్సలు తినకూడదు.

అలాగే, వాష్‌రూమ్ గోడలు, లైట్లు, షెల్ఫ్‌లు, అన్‌వ్యూజువల్ హోల్‌లు, హుక్‌లు, ఫైర్లు వంటి వాటిని గమనించాలి. ఏదైనా అనుమానాస్పదంగా ఉంటే వెంటనే స్టాఫ్‌కి చెప్పాలి లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ప్రత్యేకంగా ప్రయాణాల సమయంలో, స్టే తీసుకునే ముందు హోటల్ బాత్రూమ్‌, బెడ్‌రూమ్‌లను పూర్తిగా చెక్ చేయడం మంచిది.

Also Read: ఇలాంటి బియ్యం విషంతో సమానం..!

అత్యవసరంగా మొబైల్ ద్వారా hidden camera detect చేసే యాప్‌లు కూడా ఉపయోగించవచ్చు. జాగ్రత్తగా ఉండటం వల్ల ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందే నివారించొచ్చు. కాబట్టి ఎప్పుడైనా బయట వాష్‌రూమ్ ఉపయోగించే ముందు శ్రద్ధగా పరిశీలించడం తప్పనిసరి. జాగ్రత్తగా ఉండటం వల్లే అనేక సమస్యలను ముందుగానే నివారించొచ్చు ప్రతి మహిళ గమనించాల్సిన అవసరం ఇదే.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker