News

Abhinaya: అభినయ ఇంట తీవ్ర విషాదం, రిక్షాలో వెళుతూ కన్నుమూసిన తల్లి.

Abhinaya: అభినయ ఇంట తీవ్ర విషాదం, రిక్షాలో వెళుతూ కన్నుమూసిన తల్లి.

Abhinaya: ప్రముఖ నటి అభినయ అందరికీ సుపరిచితమే. తమిళనాడుకు చెందిన ఆమె పుట్టుకతోనే బధిర. మాట్లాడలేదు..ఆమెకు వినపడదు. అయినా కూడా తన నటనతో సినిమాల్లో రాణిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో నటించారు. ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నారు అభినయ. అయితే ఆమె తల్లి అకస్మాత్తుగా కన్నుమూశారు. రిక్షాలో బయటకెళ్లిన ఆమె.. ఊహించని విధంగా చనిపోయినట్లు నటి అభినయ వెల్లడించింది. ఆగస్టు 17న ఈ విషాదం జరిగినట్లు ఆమె తెలిపింది.

Also Read: మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఈ స్పెషల్ టీ వరం.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ చేసిందీ అందాల తార. ‘అమ్మ ఇక నువ్వు లేవనే విషయాన్ని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇలా ఉన్నట్లుండి మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావనుకోలేదు. తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే చనిపోయావు. తండ్రి-కూతురు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాద్ధృచ్చికమో కదా! నువ్వు లేకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదు. ప్రతిచోట నన్ను సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డావు. ఇప్పుడు నీ బాధ్యతని సాయిసునందన్ తీసుకుంటాడు.

జన్మంటూ ఉంటే మ మళ్లీ మళ్లీ నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా. నువ్వు ఎప్పటికీ మాతో ఉంటావమ్మ’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది అభినయ. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అభినయ తల్లి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. అలాగే ఈ బాధ, దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆమెకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

Also Read: రోజూ స్నానం చేయకపోతే మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా..?

తమిళనాడుకు చెందిన అభినయ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె పుట్టుకతోనే బధిర. అంటే మాట్లాడలేదు, వినపడదు. అయినా సరే సినిమాల్లో సత్తా చాటుతోంది. రవితేజ నటించిన శంభో శివ శంభో సినిమాతో తెలుగు ప్రేక్షకులను మొదటిసారిగా పలకరించిందీ అందాల తార. ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో వెంకటేశ్‌- మహేశ్‌లకు చెల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker