News

వేషం మార్చి మహానంది క్షేత్రంలో ప్రత్యక్షం అయిన అఘోరీ, సెల్ఫీలు తీస్తుండగా..!

మహిళా అఘోరి శుక్రవారం కర్నూలులో ప్రత్యక్షమయ్యారు. మధ్యాహ్న సమయంలో నగరంలోని బళ్లారి చౌరస్తా నుంచి గుత్తి రోడ్డు వైపు హైదరాబాదు – బెంగళూరు జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్లింది. స్థానికులు మొదట ఆమెను వింతగా చూసి ఆ తర్వాత మొక్కేందుకు ప్రయత్నించారు. కొందరు యువకులు సెల్ఫీలు తీసుకునే యత్నం చేయగా వారిని దాటుకుంటూ ఆమె ముందుకు సాగారు. అయితే తెల్లవారేసరికి మహానంది క్షేత్రంలో ప్రత్యక్షమయ్యరామే. కర్నూలులో ఆమె సొంత కారు పాడైపోవడంతో ప్రైవేట్ కారులో వచ్చారు అఘోరీ నాగసాధు.

కాషాయ వస్త్రాల్లో వచ్చిన అఘోరి నాగసాధుకు స్వాగతం పలికారు ఆలయ సిబ్బంది , పూజారులు. అనంతరం ఆమె మహానందిశ్వర స్వామి, కామేశ్వరీ దేవి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.. ఆమెకు ఆశీర్వచనాన్ని అందించారు ఆలయ పూజారులు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక కళ్యాణం కోసమే తాను పర్యటిస్తున్నారు అన్నారు.. ఆలయాలపై జరుగుతున్న దాడులను అరికట్టడం, మహిళలకు రక్షణ కల్పించడం, గోహత్యలను నివారించడం తన లక్ష్యమన్నారు. భక్తులందరూ తమ తమ పనులను భక్తిశ్రద్ధలతో చేసుకుంటూ లోక కల్యాణం కోసం పాటుపడాలన్నారు అఘోరి నాగసాధు.. మరోవైపు..

నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రాన్నీ లేడీ అఘోరి సందర్శించి శ్రీ ఉమా మహేశ్వర స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించారు. మొన్నటి వరకు దిగంబరంగా తిరుగుతూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివిధ ఆలయాలను సందర్శిస్తూన్న అఘోరి ప్రస్తుతం ఎర్రటి వస్త్రం ధరించి యాగంటి క్షేత్రానికి వచ్చారు. ఈ సందర్భంగా , అఘోరి మాట్లాడుతూ సనాతన ధర్మం కాపాడడం కోసమే నా పోరాటమని, స్పష్టం చేశారు మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల జరుగుతున్న దారుణ అఘాయిత్యాలు, నియంత్రించాలని, ఆలయాల పై జరుగుతున్న దాడులు, గోవుల వధ ను ఆపేయాలని పేర్కొన్నారు.

ప్రాణం ఉన్నంత వరకు నా ప్రయాణం కొనసాగు తూనే ఉంటుందని వెల్లడించారు. త్వరలో జరగనున్న కుంభమేళాకు మూడు రోజులపాటు వెళ్లి తిరిగి రానున్నట్లు అఘోరి తెలిపారు, లేడి అఘోరీ యాగంటి క్షేత్రానికి రానుండటం తో ఎలాంటి వివాదం చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker