గుడిలో హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ నరకం చూపిన యువకుడు.
ఐశ్వర్య లక్ష్మీ..ఇటీవల భారీ అంచనాలతో విడుదలైన ‘పొన్నియన్ సెల్వన్’ లాంటి పిరియాడికల్ మూవీలో నటించి పాన్ ఇండియా వైడ్ గుర్తింపుని సంపాదించుకుంది. ఇక ఓటిటిలో విడుదలైన ‘అమ్ము’లో నటించి ప్రశంసలు అందుకుంది. అయితే మలయాళ సినిమాలో ఆమెకు ఆఫర్ రావడంతో ఆ సినిమా ద్వారా ఆమె మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
అలా ఎంట్రీ ఇచ్చిన రెండు మూడేళ్ల వ్యవధిలోనే సుమారు అరడజనుకు పైగా సినిమాలు చేసింది. ఆ తర్వాత యాక్షన్ అనే సినిమాతో తమిళ సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తర్వాత ధనుష్ సరసన ఏకంగా జగమే తంత్రం అనే సినిమాలో కూడా కీలకపాత్రలో నటించే అవకాశం దక్కించుకుంది. అయితే తన చిన్ననాటి సమయంలో లైంగిక వేధింపులకు గురయ్యాననే విషయాన్ని తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.
తాను చిన్నప్పుడు కేరళలోని గురువాయూర్ ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక యువకుడు తన ప్రైవేట్ భాగాలను తాకి దురుసుగా ప్రవర్తించాడని ఆమె గుర్తు చేసుకున్నారు, ఆరోజు తాను పసుపు బట్టలు వేసుకోవడం ఇంకా గుర్తుందని అప్పటి నుంచి పసుపు బట్టలు వేసుకోవాలంటేనే భయం వేసేదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అప్పటి పరిస్థితి ఇప్పుడైతే లేదని ఇప్పుడు కాస్త లోకానికి ఎక్స్పోజ్ కావడంతో ఇలాంటి విషయాల మీద అవగాహన పెంచుకున్నాను అని ఆమె చెప్పుకొచ్చారు.
ఇక పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఒక కీలకపాత్రలో కనిపించిన ఆమె దానికి కొనసాగింపుగా రూపొందుతున్న సెకండ్ పార్ట్ లో కూడా అదే పాత్రలో కనిపించబోతోంది. అలాగే మలయాళంలో క్రిస్టోఫర్, కింగ్ ఆఫ్ కొత్త అనే రెండు సినిమాల్లో ఆమె నటిస్తోంది. మొత్తం మీద ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.