Akshay: స్టార్ హీరో కి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా.? కోపంతో అభిమాని దగ్గరకు వెళ్లి..!

Akshay: స్టార్ హీరో కి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా.? కోపంతో అభిమాని దగ్గరకు వెళ్లి..!
Akshay: అక్షయ్ అసలు పేరు రాజీవ్ హరి ఓం భాటియా. కెనడా ప్రవాస భారతీయుడైన. ఆయన దాదాపు 100 హిందీ సినిమాల్లో నటించారు. రెండుసార్లు ఫిలింఫేర్ పురస్కారం అందుకున్న అక్షయ్ చాలా సినిమాలకు నామినేషన్లు పొందారు. అయితే కొన్నిసార్లు విదేశాల్లోనూ అభిమానులు సెలబ్రిటీలను గుర్తు పడుతుంటారు. ఫొటోలు, సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు.

ఇప్పుడు ఇలాంటి అనుభవమే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు ఎదురైంది. ప్రస్తుతం ఆయన లండన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి వీధుల్లో ఎంతో స్వేచ్ఛగా, జాలీగా తిరుగుతూ కనిపించారు. అయితే అక్షయ్ కుమార్ ను గుర్తించిన ఒక అభిమాని వెంటనే తన మొబైల్ లో నటుడిని ఫొటోలు తీయడం స్టార్ట్ చేశాడు. ఇది గమనించిన అక్షయ్ వెంటనే అభిమాని ఫోన్ లాక్కున్నాడు.
Also Read: విశాల్-సాయి ధన్సికల పెళ్లి వాయిదా..!
అతని తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా ఇలా ఫొటోలు, వీడియోలు తీయడం సరైనది కాదంటూ మండి పడ్డాడు. అయితే చివరికి ఆ అభిమానితో కలిసి అక్షయ్ కుమార్ సెల్ఫీకి ఫోజులిచ్చినట్టు ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.
Also Read: ఇంట్లోకి వచ్చిన పామును పామును చేత్తో పట్టుకున్న సోనూసూద్.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అక్షయ్ కుమార్ అభిమానులు తమ హీరోకు మద్దతుగా కామెంట్లు పెడుతున్నారు. థోడా ప్రైవసీ దే దో భాయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడూ కూడా ఒకరి అనుమతి లేకుండా వారికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయడం కరెక్ట్ కాదంటూ సదరు అభిమానిపై మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం అక్షయ్ కుమార్ పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
Akshay lost his temper rare phenomenon 😶😶🤯#AkshayKumar is generally known for his friendly nature 🧐pic.twitter.com/dUxFl1qJHH
— Pan India Review (@PanIndiaReview) July 20, 2025