Health

Alcohol: షుగర్ ఉన్న వారు ఎక్కువగా మద్యం తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

Alcohol: షుగర్ ఉన్న వారు ఎక్కువగా మద్యం తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?

Alcohol: యుక్త వయస్సు వారి నుండి పెద్ద వయస్సు వారి వరకు నిత్యం మద్యం సేవించనిదే ఉండలేని పరిస్ధితి. మహిళలు సైతం దీనికి బానిసలుగా మారుతున్నారు. మద్యం సేవించటం ఆరోగ్యానికి ముప్పుగా పరిణమిస్తుంది. శరీరంలోని అవయవాలు దెబ్బతింటాయి. అయితే మధుమేహంతో ఇబ్బంది పడేవారికి ఇది ఓ పాయిజన్​ అని చెప్తున్నారు నిపుణులు. తీసుకునే ఫుడ్ విషయంలోనే జాగ్రత్తగా ఉండాల్సిన డయాబెటిక్ పేషెంట్లు.. మందు తాగితే ఏమైనా ఉందా అంటున్నారు. మందు తీసుకుంటే కలిగే అనర్థాలు ఇవే.. బ్లడ్ షుగర్​లో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఎందుకంటే ఆల్కహాల్ రక్తంలోని చక్కెర స్థాయిలను అమాంతం పెంచడం, తగ్గించడం చేస్తుంది.

Also Read: క్యాన్సర్‌ రోగులకు గుడ్ న్యూస్.

దీనివల్ల మధుమేహం కంట్రోల్ అవ్వడం కష్టమై.. ప్రాణాలకు ప్రమాదమవుతుంది. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డయాబెటిస్ ఉన్నవారిలో హైపోగ్లైసీమియా పెరుగుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడాన్ని హైపోగ్లైసీమియా అంటారు. ఇది షుగర్ పేషెంట్​లలో అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. మీకు షుగర్ ఉన్నా.. దీర్ఘకాలంగా ఆల్కహాల్ తీసుకుంటే.. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలకు నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఇన్సులిన్​ను ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్​లోని కణాలను దెబ్బతీస్తుంది. మధుమేహాన్ని తీవ్రతరం చేస్తుంది. అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నరాలు పూర్తిగా దెబ్బతింటాయి. ఇది మధుమేహమున్నవారిలో తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది.

ఆల్కహాల్​లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల బరువు పెరుగుతారు. ఇన్సులిన్ నిరోధకతను కూడా ఇది నాశనం చేస్తుంది. మధుమేహమున్నవారు బరువు పెరిగితే.. బీపీ కూడా అదే రేంజ్​లో పెరుగుతుంది. ఇన్​ఫెక్షన్ల ప్రమాదాన్ని కూడా డయాబెటిక్ పేషెంట్లకు పెంచుతుంది ఆల్కహాల్. అధిక ఆల్కహాల్ రోగనిరోధక శక్తిని మరింత క్షీణించేలా చేసి.. ఇన్​ఫెక్షన్లు పెరిగేలా చేస్తుంది. అలాగే మధుమేహాన్ని కంట్రోల్ చేసేందుకు వినియోగించే మందుల ప్రభావాన్ని తగ్గిస్తుంది. గుర్తించుకోవాల్సిన విషయాలివే.. బీర్, స్వీట్ కాక్​టైల్స్ వంటి కొన్నిరకాల ఆల్కహాల్.. మధుమేహమున్నవారికి మరీ ప్రమాదకరంగా మారతాయి. అధికంగా ఆల్కహాల్ తీసుకుంటే మధుమేహ సమస్యలు మరింత పెరుగుతాయి. మితంగా తీసుకుంటే ఈ ప్రమాదం కాస్త తగ్గుతుంది కానీ.. అంత మంచిది కాదు.

Also Read: గర్భిణీలు ఈ చిన్న చిన్న పనులు చేస్తే నార్మల్ డెలివరీ అవ్వడం ఖాయం.

మధుమేహం ఉన్న వ్యక్తులు మద్యం తీసుకోవాల వద్దా అనేది రక్తంలోని షుగర్​ లెవెల్స్​పై ఆధారపడి ఉంటుంది. కానీ ఏది ఏమైనా డయాబెటిస్ ఉన్నవారు ఆల్కహాల్ తీసుకుంటే కాంప్లికేషన్స్ పెరుగుతాయనే చెప్తున్నారు నిపుణులు. ఆల్కహాల్ మాత్రమే కాదు.. స్మోకింగ్ కూడా మధుమేహాన్ని తీవ్రతరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ రెండూ అలవాట్ల వల్ల శరీరంలో బీపీ పెరుగుతుందని.. ఇది క్రమంగా గుండె సమస్యలను పెంచి.. ప్రాణాలకు ప్రమాదాన్ని కలిగిస్తుందని చెప్తున్నారు నిపుణులు. హెల్తీ డైట్ తీసుకుంటూ.. రెగ్యులర్ వ్యాయామాలు చేస్తూ ఉంటే.. మధుమేహాన్ని కంట్రోల్ చేయవచ్చని సూచిస్తున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker