Health

చనిపోయే ముందు కనిపించే సంకేతాలు ఇవే. అవేంటో తెలిస్తే..?

మన మరణం ఎప్పుడు వస్తుందనే విషయం ఎవరికీ తెలియదు. మన ఆయుష్షు ఉన్నంతవరకు మనం జీవిస్తాను.అయితే కొందరికి 50 సంవత్సరాలు ఆయుష్షు ఉన్నప్పటికీ వారు 25 సంవత్సరాలకి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి ఆత్మలు పూర్తిగా ఈ లోకం విడిచి వెళ్ళమని వారి ఆయుష్షు పూర్తయ్యేవరకు ఇక్కడే తిరుగుతుంటాయని పలువురు జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే సాధారణంగా చాలామందికి మృత్యువు సంకేతాలు తెలియవు. తమ ప్రియమైన వారు అకస్మాత్తుగా మరణించినప్పుడు శోకసంద్రంలో మునిగిపోతుంటారు. అయితే, మరణానికి కొన్ని రోజుల ముందు మరణ సంకేతాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణుల పరిశోధనలో తేలింది.

మరణానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..డైలీ మిర్రర్ వెబ్‌సైట్ ప్రకారం.. UK ఆధారిత సంస్థ Web MD సుదీర్ఘ పరిశోధనల తర్వాత మరణం సంకేతాలను గుర్తించింది. ఇది మరణానికి ముందు మానవ శరీరంలో కనిపించడం ప్రారంభమవుతుంది. ఈ పరిశోధన ప్రకారం.. ఎవరైనా మరణం సమీపిస్తున్నప్పుడు అతని ఆహారం, పానీయం తగ్గుతుంది. ఆ వ్యక్తి మునుపటి కంటే తక్కువగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. అదే సమయంలో చిన్న వయస్సులోనే మరణం వైపు పయనిస్తున్న పిల్లలు ఎక్కువగా మాట్లాడటం, తినడం ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ అసాధారణ లక్షణాలు భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతోందనడానికి సంకేతం.

మరణానికి 2 వారాల ముందు నుంచే సంకేతాలు..నివేదిక ప్రకారం.. ఒకరి మరణానికి 1-2 వారాలు మిగిలి ఉన్నప్పుడు మరణం లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో వ్యక్తి అన్ని సమయాలలో అలసటగా నిర్జీవంగా ఉంటాడు. చాలా బలహీనంగా కనిపిస్తాడు. అతను కోరుకున్నప్పటికీ మంచం విడిచిపెట్టడానికి ధైర్యం చేయలేడు. అతని నిద్ర-మేల్కొనే విధానం కూడా మారుతుంది. ఈ సమయంలో మరణానికి దగ్గరిగా ఉండే వారి ఆకలి, దాహం బాగా తగ్గుతుంది. అతని గుండె కొట్టుకోవడం, రక్తపోటు, శ్వాస విధానంలో మార్పులు కనిపిస్తాయి. మరణానికి ముందు మలమూత్ర విసర్జనలో మార్పు..

మరణం 3-4 రోజులు (మరణ సంకేతాలు) మిగిలిపోయినప్పుడు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి, కార్యకలాపాలలో మార్పు వస్తుందని పరిశోధనలో పేర్కొంది. ఇంకా మృత్యువు దగ్గరలో ఉన్నప్పుడు తన గురించి మరచిపోయే అవకాశం ఉంది. ప్రజలు అడిగేదానికి అతను ఖచ్చితంగా స్పందించలేడు. ఇంకా పలు విషయాల గురించి స్పష్టంగా మాట్లాడలేడు. అతను మరణించే సమయం దగ్గరపడుతున్న కొద్దీ, అతని చేతులు, కాళ్ళపై, అతని మోకాళ్లపై చర్మం నీలిరంగు-ఊదా రంగులోకి మారవచ్చు. మూత్రవిసర్జన, ప్రేగు కదలికలు ఆగిపోవచ్చు. లేదా వారే ఆపవచ్చు. వారి శరీర ఉష్ణోగ్రత తగ్గవచ్చు. వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలవుతుంది. అలాంటి సమయంలో దగ్గరి బంధువులు వారి దగ్గరికి చేరుకుని వారి గురించి ప్రార్థించడం మంచిదని.. ఇంకా వారి ఆరోగ్యానికి కృషి చేయాలని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker