ఆల్కలీన్ వాటర్ తాగితే షుగర్ వ్యాధి రాదా..? అసలు విషయం ఏంటంటే..?
ఆల్కలీన్ వాటర్ అంటే అయనీకరణం చేయబడిన నీరు, అంటే నీటి pH స్థాయి పెరిగింది. pH స్థాయి అనేది ఒక పదార్ధం 0 నుండి 14 స్కేల్‌లో ఎంత ఆమ్ల లేదా ఆల్కలీన్‌గా ఉందో కొలిచే సంఖ్య. ఉదాహరణకు, స్థాయి 1 అయితే, పదార్ధం చాలా ఆమ్లంగా ఉంటుంది మరియు అది 13 అయితే, అది చాలా ఆల్కలీన్ అని అర్థం.
అయితే ప్రస్తుతం మార్కెట్లో డ్రింకింగ్ వాటర్, ఆర్‌ఓ వాటర్, డబుల్ ఆర్‌ఓ వాటర్, ఆల్కలీన్ వాటర్ (బ్లాక్ వాటర్).. ఇలా ఎన్నో రకాల తాగు నీరు దొరుకుతున్నాయి. వీటిలో ఏ నీరు మంచిదనే దానిపై మనలో చాలా మందికి విషయపరిజ్ఞానం కొరవడింది. నీటిని సరఫరా చేసే కంపెనీల మాటలు నమ్మి ఆయా కంపెనీల నీటిని కొనుగోలు చేస్తుంటాం. నిజానికి, పీహెచ్ తక్కువగా గానీ, ఎక్కువగా గానీ ఉండే వాటర్ తాగడానికి పనికిరాదని పరిశోధకుల మాట. సాధారణ నీటిలో పీహెచ్ స్థాయి 6 నుంచి 7 మధ్యలో ఉంటుంది.
అయితే, ఆల్కలీన్ నీటిలో పీహెచ్ స్థాయి 8, 9 గా ఉంటుంది. ఇలా పీహెచ్ స్థాయిలు 8, 9 గా ఉన్న నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పరిశోధకులు తేల్చారు. ఈ నీటినే ఆల్కలీన్ ఆయోనైజ్డ్ వాడర్ అని కూడా పిలుస్తారు. ఆల్కలీన్ వాటర్‌తో ప్రయోజనాలివీ.. రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువ మోతాదులో ఉంచుతుంది. హై కొలెస్ట్రాల్ స్థాయిలను నివారించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో ఆసిడ్ లెవల్స్ తగ్గించి ఎముకలకు బలాన్నిస్తుంది.
ఎముకలు విరగకుండా ఉండేందుకు సహాయపడుతుంది. రక్తపోటుపై అనుకూల ప్రభావాన్ని చూపి హెచ్చుతగ్గులను నియంత్రిస్తుంది. జీవక్రియను మెరుగుపర్చడంతోపాటు శరీరం బరువు పెరుగకుండా కాపాడుతుంది. కడుపులో యాసిడ్లను న్యూట్రలైజ్ చేసి ఆసిడ్ రిఫ్లక్స్, గుండె మంటను దూరం చేస్తుంది. శరీరం నుంచి విష పదార్థాలను బయటకు పంపించి వేస్తుంది. దీర్ఘకాలిక వ్యాధి అయిన మస్క్యులో స్కెలెటర్ నొప్పులను తగ్గిస్తుంది. కండరాలు బాగా లూబ్రికేట్ అయ్యేలా అల్కలీన్ వాటర్ సాయపడుతుంది.