రాత్రి పూట పాలలో అల్లం రసం కలిపి తాగితే ఆ సమయంలో మిమ్మల్ని ఎవరు ఆపలేరు.
అల్లం పాలుతో జలుబు, ఫ్లూ, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అల్లం పాలు తాగితే రోగ నిరోధకశక్తి పెరగడమే కాకుండా వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. అల్లంలో ఉండే థర్మోజెనిక్ గుణాలు చలికాలంలో మనల్ని వెచ్చగా ఉంచుతాయి. అల్లం, పాలు రెండింటినీ కలిపి తాగడం వల్ల లభించే పోషకాలు ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే అల్లంలో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయో అందరికీ తెలిసిందే.
మనకు వచ్చే స్వల్ప అనారోగ్య సమస్యలైన దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం తదితర సమస్యల నుంచి అల్లం మనల్ని బయట పడేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఉండే సూక్ష్మ క్రిములను చంపేస్తాయి. అలాంటి అల్లాన్ని రసం తీసి దాన్ని నిత్యం పాలలో కలుపుకుని తాగితే మనకు ఇంకా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
జింజర్ మిల్క్ (అల్లం రసం కలిపిన పాలు) తాగడం వల్ల మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణాశయం, పేగుల్లో ఉండే సూక్ష్మ క్రిములు నశిస్తాయి. వర్షాకాలంలో మనకు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. జింజర్ మిల్క్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉండే ఫ్రీ ర్యాడికల్స్‌ను నశింపజేస్తాయి. దీంతో క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. సూక్ష్మ క్రిములు శరీరంలోకి చేరగానే నశిస్తాయి.
జీర్ణశక్తి లేని వారు లేదా ఆ శక్తి బాగా తగ్గిన వారు నిత్యం జింజర్ మిల్క్‌ను తాగితే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఎలాంటి ఆహారాన్నయినా సరే అవలీలగా జీర్ణం చేసుకోగలుగుతారు. అలాగే మలబద్దకం, కడుపు నొప్పి, అసిడిటీ తగ్గుతాయి. జింజర్ మిల్క్‌లో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తాయి. ఆస్టియో పోరోసిస్ సమస్య ఉన్నవారు ఈ మిల్క్‌ను తాగితే మంచిది. దీంతో ఎముకల వద్ద శరీర భాగం వాపులకు గురి కాకుండా ఉంటుంది. నొప్పులు తగ్గుతాయి.
గొంతు నొప్పి, మంట, గొంతు బొంగురు పోవడం సమస్యలు ఉన్నవారు జింజర్ మిల్క్ తాగాలి. ఈ మిల్క్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఆయా సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు జింజర్ మిల్క్ తాగితే వారి షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే రక్తంలో ఉండే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.