ఆరోగ్యమని అదే పనిగా రోజు అల్లం టీ తాగితే ఎంత ప్రమాదమో తెలుసా..?
అల్లం ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికి తెలిసిందే. వైద్యులు, ఆయుర్వేద నిపుణులు కూడా ఎప్పటి నుంచో చెబుతున్న మాట. విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది. అయితే చాలా మంది ఉదయాన్నే అల్లం టీ తాగుతారు. అల్లం లేని టీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. ఇది టీ రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బాగా జలుబు చేసినా.. దగ్గు ఉన్నా.. ఘాటైన అల్లం టీ ఒక్క కప్పు పడితే చాలు. ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది. అందుకే వర్షాకాలం, శీతాకాలంలో చాలా మంది అల్లం టీని తాగుతుంటారు. టీకి అద్భుతమైన రుచిని ఇచ్చే అల్లం వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. అల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలిసి ఉండొచ్చు.కానీ అల్లం పరిమిత పరిమాణంలో తీసుకుంటే, దాని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
కానీ రుచి కోసం.. అవసరానికి మించి అల్లం తినడం వల్ల గుండెల్లో మంట, కడుపు నొప్పి మొదలైన ఇబ్బందులు కనిపిస్తాయి. అల్లంలో యాంటీ ప్లేట్‌లెట్స్ ఉంటాయి. అల్లంలోని ఈ లక్షణాలు రక్తస్రావం కలిగిస్తాయి. చాలా మంది నల్ల మిరియాలు, లవంగాలు వంటి మసాలా దినుసులనే కూడా అల్లం టీలో వేస్తుంటారు. ఇలా చేస్తే మరిన్ని సమస్యలు వస్తాయి.
అల్లం టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. జీర్ణకోశ వ్యాధులు వచ్చే ప్రమాదముంది. అందుకే అల్లం వేసుకొని టీ ఎక్కువగా తాగకూడదు. అల్లం మితంగా, తక్కువ పరిమాణంలో తీసుకుంటే అది జీర్ణ శక్తిని పెంచుతుంది. కానీ అధికంగా తీసుకుంటే మాత్రం జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తుంది. తద్వారా అనేక రకాల ఉదర సంబంధ సమస్యలు వస్తాయి.