Alone Life: ఒంటరిగా బతుకుతున్నవారికి వచ్చే ప్రాణాంతక సమస్యలు ఇవే.

Alone Life: ఒంటరిగా బతుకుతున్నవారికి వచ్చే ప్రాణాంతక సమస్యలు ఇవే.
Alone Life: ‘భాగస్వామి లేకపోవడం వల్లే వారు ఒంటరితనంతో విచారంగా ఉంటున్నారు’… ‘భాగస్వామి కోసం వెదుకుతున్నారు, కానీ, సరైన జోడి దొరకలేదు’… ‘వారు ఏదో తప్పు చేసి ఉంటారు, అందుకే ఒంటరిగా బతకాల్సి వస్తోంది’. అయితే ఒంటరితనం మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా అనేక ప్రమాదకరమైన వ్యాధులకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. CDCలో ప్రచురించిన ఒన నివేదిక ప్రకారం ఒంటరితనం కొన్నిసార్లు ప్రాణాలకు కూడా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Also Read: యువ జంటల్లో కనిపిస్తున్న కొత్త ట్రెండ్.
ఒంటిరితనం వల్ల కొన్ని సమస్యలు తప్పవని అంటున్నారు. ఒంటరిగా జీవించే వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లకు సమానంగా ఒంటరిగా జీవించే వారిలో కూడా ఈ సమస్య ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒంటరిగా నివసించే వారికి దీని ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు తరచుగా నిద్ర సమస్యలు ఎదుర్కొంటారని అంటున్నారు.

ఒంటరితనం దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నారు. సమాజం నుంచి ఒంటరిగా జీవించే వారిలో అధిక రక్తపోటు, ఊబకాయంతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధనల్లో తేలింది. ఒంటరితనం సామాజిక ఆందోళనకు కారణమవుతుంది. ఇలాంటి వారు బయటకు వెళ్లడం, ఇతరులను కలవడానికి ఆందోళన చెందుతుంటారు. ఇతరులతో మాట్లాడేందుకు వెనుకాడతారు.
Also Read: రాత్రిపూట తినకుండా నిద్రపోతే..
తమ గురించి ప్రజలు ఏమనుకుంటారోనని భయపడుతుంటారు. ఒంటరిగా జీవించే వారిలో ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. ఇది మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఒంటరిగా జీవించే వారిలో రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఇలాంటి వారు పదే పదే అనారోగ్యానికి గురవుతారు. పరిశోధనల్లో తేలిన వివరాలు ప్రకారం ఒంటరితనం కారణంగా శరీరంలో యాంటీ బాడీలు సరిగ్గా ఏర్పడవు. ఇది ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.