Health

ఈ కలబంద గుజ్జులో ఉన్న రహస్యం తెలిస్తే వెంటనే తింటారు.

కలబందలో ఉండే గుజ్జు 96 శాతం నీటితోనే తయారవుతుంది. శతాబ్దాలుగా అలోవెరాను సంప్రదాయ ఔషధ మొక్కగా వాడుతున్నారు. అలోవెరాలో గాయాలను మాన్పించే గుణాలు, చర్మాన్ని కోమలంగా మార్చే లక్షణాలూ ఉన్నాయి. వేడి వాతావరణంలో పెరిగే ఈ మొక్కను మనం నీడలో, ఎండలో ఎక్కడైనా పెంచుకోవచ్చు. అయితే సాధారణంగా మన ఇంటి పెరట్లో పెంచుకునే (అలోవెరా) కలబంద మొక్కలో ఉన్న ఔషధ గుణాలు సాధారణంగా వచ్చే అనేక అనారోగ్య సమస్యలను నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

ఈ విషయం చాలామందికి అవగాహన లేక అలోవెరా మొక్కలను కేవలం ఇంటి పెరట్లో అందం కోసం మాత్రమే పెంచుకుంటున్నారు.మనం ప్రతిరోజు వాడే సబ్బులు, షాంపూలు, లోషన్, హెయిర్ ఆయిల్ వంటి సౌందర్య ఉత్పత్తుల్లో ఎక్కువగా అలోవెరా మొక్క గుజ్జుని ఉపయోగిస్తారు. అలోవెరా మొక్క గుజ్జును ప్రతిరోజు మన ఆహారంలో తీసుకున్నట్లయితే చర్మ సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, ఒళ్ళు నొప్పులు, డయాబెటిస్ వంటి అనేక వ్యాధులను నియంత్రణలో ఉంచవచ్చు.

అలోవెరా గుజ్జులో విటమిన్స్, మినరల్స్, సహజ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియన్ గుణాలు, పీచు పదార్థం పుష్కలంగా లభిస్తాయి కావున ప్రతిరోజు ఉదయాన్నే అలోవెరా గుజ్జులో నిమ్మ రసాన్ని జోడించి సేవించినట్లయితే మనలో రోగ నిరోధక శక్తి పెంపొందించడంతోపాటు,శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దాంతో ఉపకాయ సమస్య, అతిబరువు సమస్య నుంచి బయటపడవచ్చు.

అలాగే తీవ్రమైన తలనొప్పి , కండరాల నొప్పులు, కీళ్లవాపు, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా అలోవెరా గుజ్జుకు నిమ్మరసం, తేనె ,పుదీనా కలిపి ప్రతిరోజు సేవిస్తే ఇన్సులిన్ ఉత్పత్తి సహజంగా జరిగి రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. కలబంద గుజ్జులో ఉన్న పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి గ్యాస్ట్రిక్ మలబద్ధకం విరోచనాలు వంటి అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది.

అలాగే శరీరంలో పేరుకుపోయిన చెడు మలినాలైనా క్యాన్సర్ కణాలను నియంత్రించి చర్మ క్యాన్సర్, ఉదర క్యాన్సర్, లివర్ క్యాన్సర్ రాకుండా మనల్ని రక్షిస్తుంది. అలోవెరా గుజ్జును మన ముఖ చర్మంపై సున్నితంగా మర్దన చేసుకుంటే మృత కణాలు తొలగి చర్మం కాంతివంతంగా తయారవుతుంది. తల వెంట్రుకలకు మర్దన చేసుకుంటే ఇందులో ఉన్న యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును తొలగించి జుట్టు కుదుర్లను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker