షుగర్ వ్యాధితో బాధపడే వారు ఉసిరికాయ తినవచ్చా..? తింటే ఏమవుతుంది.
కార్తీక మాసంలో వన భోజనాలు సందడి, ఉసిరి చెట్ల నీడనా ప్రారంభం కావాలి, దీనికి మన పూర్వీకులు అత్యంత ప్రాధాన్యత నిచ్చారు. ఇప్పుడంటే ఏదో ఒక తోట అయితే చాలా అనుకుంటున్నారు గానీ, పూర్వకాలంలో ఉసిరి చెట్లు కనీసం ఒక్కటైనా ఉండేది చూసుకుని మరి వన భోజనం నిర్ణయించే వారు. అయితే ఉసిరిని ఆయుర్వేద వైద్యంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన పదార్ధం. ఉసిరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరికాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, క్యాల్షియం, ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ అధికంగా ఉంటాయి.
వీటిని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడేవారికి ఉసిరికాయను అద్భుతమైన ఔషదంగా చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది షుగర్ వ్యాధి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. మధుమేహం వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారిపోతుంది. అందుకే ఈ మధుమేహం బాధితులు ఎప్పటికప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడేవారికి ఉసిరికాయ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో అవసరమైన విటమిన్ సి అధికమోతాదులో ఉంటుంది.
అలాగే ఉసిరికాయ ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల పెంచుతుంది. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు ఉసిరి ముక్కలను తినడం వలన షుగర్ నియంత్రణలో ఉంటుంది. అందులో పుష్కలంగా ఉండే విటమిన్ సి మరియు క్రోమియం రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంచేలా తోడ్పడతాయి. ఉసిరి కాయతో జ్యూస్ తయారు చేసుకుని తీసుకోంటే మంచి ఫలితం ఉంటుంది. అందులో చిటికెడు పసుపు యాడ్ చేసి తీసుకుంటే మరింత మంచి ఫలితం ఉంటుంది. ఉసిరి జ్యూస్ శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ర్టాల్ ని తగ్గించటంలో సహాయకారిగా పనిచేస్తుంది. రోజుకి 2 నుంచి 3 గ్రాముల ఆమ్లా పౌడర్ ను తీసుకుంటే చాలు డయాబెటిక్ నుంచి బయటపడవచ్చు.
అంతే కాకుండా అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది. సంతానలేమితో ఇబ్బంది పడే దంపతులు. ఉసిరి జ్యూస్ తీసుకుంటే సంతాన సమస్యలు దూరం అవుతాయి. అలాగే నోటి పూత, పుండ్లతో బాధ పడుతుంటే ఉసిరి బాగా ఉపకరిస్తుంది. జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి శరీరంలో ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. దానిమ్మ పండులో కంటే 17 రెట్లు ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అయ్యాక తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.