News

చలితో వణుకుతున్న పేదలకు సాయం చేసిన టాలీవుడ్ హీరోయిన్, వైరల్ అవుతున్న వీడియో.

అనన్య నాగళ్ల మంచితనం గురించి మనందరికీ తెలిసిందే. మంచి మంచి సేవ కార్యక్రమాలు చేస్తూ మంచి పనులు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూ ఉంటుంది. మొన్నటికి మొన్న ఏపీలో వరదలు వచ్చిన సమయంలో ఏ హీరోయిన్ స్పందించకపోయినా అనన్య నాగళ్ళ రెండు రాష్ట్రాలకు కలిపి 5 లక్షలు సాయం అందించింది. అయితే . ఇటీవల అనన్య నటించిన చిత్రం పొట్టేల్ సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో అనన్య పోషించిన బుజ్జమ్మ పాత్ర విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఇక వకీల్ సాబ్ తర్వాత మరో మెగా ఆఫర్ దక్కించుకుందీ ముద్దుగుమ్మ. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న చిత్రంలో అనన్య నటిస్తుంది. ఇటీవలే ఈ అమ్మడుకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు మేకర్స్. సినిమాల సంగతి పక్కన పెడితే.. అనన్య కు హెల్పింగ్ నేచర్ ఎక్కువ. కొన్ని నెలల క్రితం భారీ వర్షాలు, వరదలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఆస్తి నష్టం, ప్రాణం నష్టం జరిగింది. ఈ క్రమంలోనే అనన్య ముందుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు రూ. 5 లక్షల విరాళం ప్రకటించింది.

ఏపీకి సంబంధించిన చెక్ ను స్వయంగా వెళ్లి సీఎం చంద్రబాబు నాయుడుకు అందజేసింది. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకుందీ ముద్దుగుమ్మ. రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి గిలి చంపేస్తోంది. వృద్ధులు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఇక హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో రో రోడ్లపై ఎక్కడపడితే ఎంతోమంది నిరాశ్రయులు నివసిస్తున్నారు. ఇప్పుడు వీరి చలితో గజ గజ వణుకుతున్నారు. అలాంటి వారికోసం తానే స్వయంగా దుప్పట్లు అందించింది అనన్య. హైదరాబాద్ బస్టాండ్ లలో నిద్రిస్తున్న ప్రయాణికులు, పేదలు, అనాథలకు తానే స్వయంగా దుప్పట్లు కప్పింది.

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్అవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు అనన్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అనన్య రియల్లీ చాలా గ్రేట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు .హీరోయిన్ అయి ఉండి అంత సింప్లిసిటీగా మంచి పనులు చేయడం చాలా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker