Anjeer Benefits: అంజీర్ పండు కాదు, ఆకులోనూ ఇలా చేసి వాడితే చాలు, ఆ సమస్యలన్నీ వెంటనే తగ్గిపోతాయి.

Anjeer Benefits: అంజీర్ పండు కాదు, ఆకులోనూ ఇలా చేసి వాడితే చాలు, ఆ సమస్యలన్నీ వెంటనే తగ్గిపోతాయి.
Anjeer Benefits: అంజీర పండ్లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తపోటు నియంత్రణకు తోడ్పడుతుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్‌లు సి, ఇ, ఎ కూడా దీనిలో ఉన్నాయి. అందేరూ అంజీర పండ్లు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

అయితే అత్తిపండ్లలో ఫైబర్, ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, జింక్, ఫొలేట్, రిబోఫ్లేవిన్, భాస్వరం మెండుగా ఉన్నాయి. తరచూ అంజీర్ పండ్లు తీసుకోవటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది.
Also Read: ఇలాంటి బియ్యం విషంతో సమానం..!
అంజీర్ పండుతో ఊపిరితిత్తుల్లో సమస్యలు, శ్వాసలో ఇబ్బందులను తొలగిస్తుంది. ఎముకలు, దంతాలను దృఢంగా ఉంచుతుంది. పైల్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నిద్రలేమిని దూరం చేస్తుంది. జుట్టు సమస్యలను సైతం నివారిస్తుంది. ఒత్తైన, బలమైన జుట్టు పెరుగుదలకు దోహదం చేస్తుంది. అంజీర్ పండ్లే కాదు ఆకులు కూడా ఆరోగ్యానికి బోలెడంత మేలు చేస్తాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: రోజు ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు.
అంజీర్ ఆకుల్లో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అంజీర్ ఆకులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. మధుమేహం ఉన్నవారు క్రమం తప్పకుండా అంజీర్ ఆకులను తింటే ఇన్సులిన్ అవసరం తగ్గుతుంది. అంజీర్ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధులతో సంబంధం ఉన్న ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: రోజు ఉదయాన్నే రెండు పచ్చి వెల్లుల్లి తింటే..!
అంతేకాదు.. అంజీర్ ఆకులు మూత్ర సంబంధిత వ్యాధుల్ని సైతం నివారిస్తుంది. సహజ మూత్రవిసర్జన మందుగా పనిచేస్తాయి. మూత్ర నాళం, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అంజీర్ ఆకుల రసం దాని ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌ల కారణంగా మొటిమలను తొలగించగలవు.