ఈ చెట్టు ఆకులను ఎండపెట్టి తీసుకుంటే 4 రోజుల్లోనే డయాబెటిస్ తగ్గిపోతుంది.
సాధారణ పండ్లతో పాటు ఎండు ఫలాలుగానూ ఇవి అందుబాటులో ఉంటాయి. అంజీర్ పండ్లు చాలా రుచిగా ఉండడమే కాదు అద్భుతమైన పోషకాలు వీటి సొంతం. అత్తి పండ్లలో పోటాషియం, ఖనిజ లవణాలు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండ్లు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. పలు రకాల వ్యాధులకు అంజీర్‌తో చెక్ పెట్టవచ్చు. రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు ఇది ఇన్సులిన్‌గా పనిచేసి కంట్రోల్ చేస్తుంది.
ఆయుర్వేదంలో అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానముంది. అయితే అంజీర్ ఆకులను తాజాగా లేదా ఎండబెట్టి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో అద్భుతమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు లభిస్తాయి. కాబట్టి 4 నుంచి 5 అంజీర్ ఆకులను నీటిలో 10 నిమిషాల పాటు ఉడకబెట్టి ఆ నీటిని ఖాళీ కడుపుతో తాగాల్సి ఉంటుంది.
కావాలంటే అంజీర ఆకులను ఎండబెట్టి పొడిలా తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీటి ఆకును గ్రీన్ టీగా తాగడం వల్ల కూడా మంచి లాభాలు కలుగుతాయి. ఎముకల బలహీనతకు చెక్..
ఎముకల బలహీనత సమస్యలతో బాధపడేవారు తప్పకుండా అంజీర్ ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ ఆకులతో తయారు చేసిన పొడిని తీసుకోవడం వల్ల శరీరానికి పొటాషియం, కాల్షియం లభించి చాలా ఎముకలు దృఢంగా మారుతాయి. అంతేకాకుండా శరీర నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గుండె సమస్యలకు చెక్.. గుండె జబ్బులతో బాధపడేవారు అంజీర్ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
అయితే ఇందులో ఒమేగా-3, ఒమేగా 6 మూలకాలు లభిస్తాయి. కాబట్టి గుండెను దృఢంగా చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణాలు కూడా నియంత్రణలో ఉంటాయి.