అను ఇమ్మాన్యుయేల్ దారుణంగా మోసం చేసిన ఆ స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా..?
మజ్ను మూవీతో తెలుగులోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అను ఇమ్మాన్యుల్.. వెంటవెంటనే ఆఫర్లను దక్కించుకున్నారు. అయితే ఏ సినిమా అనుకున్న స్థాయిలో విజయాలు రాలేదు. అయినప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉంది. అయితే
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ ను నమ్మి తాను దారుణంగా మోసపోయానని తనకు జరిగిన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.ఈ క్రమంలోనే ఈమె పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
ఈ సినిమాలో ఈమెతో పాటు నటి కీర్తి సురేష్ కూడా నటించారు. త్రివిక్రమ్ ఒక సినిమా కోసం పనిచేస్తున్నారు అంటే ఆ సినిమాలో సెలబ్రెటీల రేంజ్ కూడా మారిపోతుందని అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అజ్ఞాతవాసి సినిమాకు త్రివిక్రమ్ పనిచేయడంతో
అందరి హీరోయిన్ల మాదిరిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడంతో తన అదృష్టం కూడా మారిపోతుందని ఈమె గుడ్డిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ ను నమ్మి అతనిపై నమ్మకంతో అజ్ఞాతవాసి సినిమాలో నటించిందని చెప్పుకొచ్చారు.అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో కేవలం త్రివిక్రమ్ పై నమ్మకంతోనే తను సినిమాలో నటించాలని అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో తాను పూర్తిగా మోసపోయానని ఈమె వెల్లడించారు.