Appendix Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే అపెండిక్స్ క్యాన్సర్ ఉన్నట్లే..! తగ్గాలంటే ఏం చెయ్యాలో తెలుసా..?

Appendix Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే అపెండిక్స్ క్యాన్సర్ ఉన్నట్లే..! తగ్గాలంటే ఏం చెయ్యాలో తెలుసా..?
Appendix Cancer: అపెండిక్స్ క్యాన్సర్ చాలా అరుదైనది. ప్రతి పది లక్షల మందిలో ఒకటి లేదా ఇద్దరికి మాత్రమే ఇది సోకుతుంది. అయినా, యువతలో ఇది పెరుగుతుండటం మాత్రం కాస్త ఆందోళన కలిగించే విషయమే. అలాగు పెద్దపేగు (కొలొరెక్టల్), రొమ్ము, క్లోమ గ్రంధి (ప్యాంక్రియాటిక్) క్యాన్సర్లు కూడా యువతలో పెరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు.

అపెండిక్స్ క్యాన్సర్ కు కారణాలు ఏంటి..?
వారసత్వంగా వచ్చేవి..లించ్ సిండ్రోమ్, ఫ్యామిలియల్ అడెనోమాటస్ పాలిపోసిస్ వంటి జబ్బులు కూడా అపెండిక్స్ క్యాన్సర్ కు కారణం కావచ్చు. జీర్ణ సమస్యలు.. క్రోన్స్ డిసీజ్ లాంటి ఎక్కువ కాలం ఉండే కడుపు జబ్బులు.. అలాగే చికిత్స చేయని పేగు ఇన్ఫెక్షన్లు కూడా అపెండిక్స్ లోపల కణాలను మార్చేయవచ్చు.
చెడు అలవాట్లు.. పొగతాగడం, ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం తినడం, పీచుపదార్థాలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి. కడుపులో యాసిడ్ ను తగ్గించే మందులను ఎప్పుడూ వాడుతూ ఉండటం, ఇంట్లో ఎవరికైనా గతంలో కడుపు, పేగు క్యాన్సర్ లు ఉన్నా ఈ జబ్బు రావడానికి కారణం కావచ్చు.
Also Read: రోజూ పరగడుపున కిస్మిస్ నీళ్లు తాగితే చాలు.
ఎలాంటి లక్షణాలు ఉంటాయి..?
కడుపులో కుడివైపు కింది భాగంలో నిరంతరం నొప్పి ఉండటం. కారణం లేకుండా బరువు తగ్గడం. ఎప్పుడూ వికారం, కడుపు ఉబ్బరంగా అనిపించడం. కింది భాగంలో బరువుగా అనిపించడం. కడుపు కింది భాగంలో ముద్దలాగా లేదా గట్టిగా అనిపించడం.
ఇలా రాకుండా ఏం చేయాలి..?
బరువును కంట్రోల్ లో ఉంచుకోవడం. తాజా పండ్లు, కూరగాయలు, పూర్తి ధాన్యాలు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవడం. అధిక షుగర్, ప్రిజర్వేటివ్‌లు కలిపిన ఫుడ్ కి దూరంగా ఉండడం. రోజూ వ్యాయామం చేయడం. పొగతాగడం, మద్యం పూర్తిగా మానేయడం.
Also Read: వర్షాకాలంలో డీహైడ్రేషన్ అయితే మీ ప్రాణాలకే ముప్పు.
క్రోన్స్ డిసీజ్, గాస్ట్రిటిస్ వంటి వ్యాధులను మొదట్లోనే గుర్తించి చికిత్స చేయించుకోండి. దీని వల్ల భవిష్యత్తులో క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కుటుంబంలో జీర్ణవ్యవస్థ క్యాన్సర్ ల చరిత్ర ఉంటే.. జన్యు పరీక్షలు, ప్రాథమిక స్క్రీనింగ్ లు చేయించుకోవడం మంచిది. ఇది వ్యాధిని ముందుగానే గుర్తించి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.