ఆర్థరైటిస్ వ్యాధి ఎలాంటి వారికీ వస్తుందో తెలుసా..?
పోషకాహారాన్ని అనుసరించడం ద్వారా మనం సరైన కీళ్లనొప్పులు కాకుండా అనేక ఇతర వ్యాధుల నుండి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు. సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది. కాబట్టి సరైన నిద్రను నిర్వహించడం చాలా ముఖ్యం.మద్యపానం ,ధూమపానం కీళ్ళనొప్పులు మాత్రమే కాకుండా ఇతర ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతుంది. అయితే సాధారణంగా మానవుల శరీర బరువంతా మోకాళ్లపైనే పడుతుంది. ఫలితంగా శరీరంలోని ఇతర జాయింట్స్ కంటే ఈ మోకాళ్లు జాయింట్స్ బాగా ఆరిగిపోతుంటాయి. మెడికల్ పరిభాషలో దీనిని ‘ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీ జాయింట్’ అని పిలుస్తారు.
వయసు పైబడిన వారిలోనేకాదు చిరుప్రాయంలో ఉన్న వారిలో కూడా ఈ జబ్బు వస్తుంది. దీనికి ముఖ్య కారణం జాయింట్స్ వద్ద తగిలే దెబ్బలు అని డాక్టర్లు చెబుతుంటారు. సాధారణంగా ఈ జబ్బు మానవులు చేసే పొరపాట్ల కారణంగానే వస్తుంది. అవేంటంటే బాగా తిని పొట్ట పెంచడం, రోజూ ఒకే దగ్గర కూర్చొని ఎలాంటి శారీరక శ్రమ చేయకపోవటం, చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువగా, అతిగా జుంబా, స్టెప్పర్, ఎయిరోబిక్స్, జాగింగ్ తదితర ఎక్సర్సైజ్లు చేయడం కూడా ఈ వ్యాధికి దారితీస్తుంది. మోకాళ్లపై ఎక్కువ ప్రెజర్ పెట్టే ఆటలు కూడా ఆడకూడదు. భారీ వెహికల్స్ ఎక్కువ కాలం నడపకూడదు. ఒకేచోట కదలకుండా కూర్చోకూడదు. విటమిన్ డి లోపం ఉంటే వాటి సప్లిమెంట్లు వాడటం, ఉదయం పూట ఎండలో నిల్చోవడం చేయాలి.
డెస్క్ జాబ్ చేసే ఉద్యోగులు ఎక్కువగా లావు అవుతుంటారు. వీరికి ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి జాగ్రత్త పడాలి. వీరు ప్రతి 50 నిమిషాలకోసారి 5 మినిట్స్ వాకింగ్ చేయడం మంచిది. అలానే లెగ్ ఎక్సర్సైజ్లు చేస్తే కీళ్ల నొప్పులు రావు. 33 శాతం మంది ప్రజలకు ఆస్టియో ఆర్థరైటిస్ వంశ పారంపర్యంగా వస్తోంది. కాళ్లు, చేతి వేళ్ల మధ్య ఉండే జాయింట్స్‌లో నొప్పి, వాపు రావడాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. ఈ తీవ్రమైన జబ్బు కూడా పారంపర్యంగా వస్తుంది. కాబట్టి ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఈ జబ్బు ఉంటే వారంతా కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. చిన్నతనంలో వచ్చిన ఇన్ఫెక్షన్లు, టీబీ జబ్బు ఉన్నవారిలో సెప్టిక్ ఆర్థరైటిస్ వంటివి వస్తుంటాయి.
ఒక్కసారి జాయింట్‌లోని మృదులాస్థి అరిగిపోవడం ప్రారంభమైతే దాన్ని ఆపడం ఎవరి తరం కాదు. అందుకే జాగ్రత్త పడటం మంచిది. ఒకవేళ దురదృష్టవశాత్తు ఆర్థరైటిస్ వచ్చిన వారు వైద్యుల సలహా మేరకు మందులు వాడొచ్చు. కొల్లాజిన్ పెప్టెడ్స్ మెడిసిన్స్ మోకాళ్లలోని మృదులాస్థి పెరగడానికి ఉపయోగపడతాయి. అలానే ఆర్థరైటిస్‌కు ఫిజికల్ లేదా ఆక్యుపేషనల్ థెరపీ, వ్యాయామం, ఓవర్-ది-కౌంటర్ నొప్పి-ఉపశమన మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. ఆయుర్వేదం, ఔషధ తైలాలతో మసాజ్ చేయడం, హోమియోపతి వంటి ప్రత్యామ్నాయ మందులు కూడా కొంతమందికి ఉపశమనాన్ని అందిస్తాయి.