Ash Gourd Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలు, మీ పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది.

Ash Gourd Juice : ఉదయాన్నే ఖాళీ కడుపుతో బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే చాలు, మీ పొట్ట మొత్తం క్లీన్ అవుతుంది.
Ash Gourd Juice : బూడిద గుమ్మడి కాయలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మెగ్నీషియం, విటమిన్ సి, నియాసిన్, డైటరీ ఫైబర్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. తెల్ల గుమ్మడికాయ తింటే ఆకలి తగ్గుతుంది. కాబట్టి మీరు మళ్లీ మళ్లీ తినవలసిన అవసరం లేదు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అయితే బూడిద గుమ్మడి న్యూట్రిషనల్ వాల్యూస్‌తో నిండి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. దీనిలోని ఎలక్ట్రోలైట్స్ మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.
Also Read: పొట్టలో నులిపురుగులు పోవట్లేదా..?
డ్రై స్కిన్ వంటి సమస్యలున్నవారు దీనిని హ్యాపీగా తీసుకోవచ్చు. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలున్నవారు దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. జీర్ణ సమస్యలను దూరం చేసి మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కణాలను రిపేర్ చేస్తాయి. క్రోనికల్ సమస్యలు రాకుండా రక్షిస్తాయి. దీనిలోని విటమిన్ సి రోగ నిరోధక శక్తిని పెంచి.. సీజనల్ వ్యాధులు రాకుండా చేస్తుంది.

బూడిద గుమ్మడిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి, వాపును దూరం చేస్తాయి. అలాగే దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు జుట్టుకు, స్కిన్‌కి మంచి ప్రయోజనాలు అందిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆప్షన్. దీనిలోని ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ జర్నీ కోసం మీరు కచ్చితంగా నిపుణుల సలహా తీసుకోవాలి. కొందరిలో బూడిద గుమ్మడి అలెర్జీని కలిగిస్తుంది.
Also Read: మహిళల్లో గుండెపోటు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా..?
దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎక్కువ ప్రయోజనాలు కావాలని ఎక్కువ తాగితే.. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. షుగర్ ఉన్నవారు దీనిని తీసుకోకపోవడమే మంచిది. డయాబెటిస్ మెడిసిన్, రక్తం చిక్కగా ఉన్నవారు బూడిద గుమ్మడి జ్యూస్ తాగవద్దని చెప్తున్నారు.