మీకు ఆస్తమా ఉందా..! పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయొద్దు.

ప్రపంచంలో ఉన్న సుమారు 15-20 % జనాభా ఈ శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్నావారే. దగ్గు,ఛాతి బిగిసిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మరియు నిద్రలో గురకపెట్టడం వంటివి ఈ వ్యాధి యొక్క లక్షణాలు. అయితే ఆస్తమా ఉన్నవారు.. వర్షాకాలం, శీతాకాలాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. శీతల గాలుల్లో బయట తిరగడం, ఎక్కువసేపు చన్నీళ్లలో ఉండటం, వర్షంలో తడవడం వంటివి చేయకూడదు.
వాటితో పాటు కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి. లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆస్తమా ఉన్నవారు తినకూడని పదార్థాల్లో ప్రధానమైనది ఐస్ క్రీమ్. చాలామందికి వర్షంలో ఐస్ క్రీమ్ తినాలనే కోరిక ఉంటుంది. అలాంటి కోరికలకు ఆస్తమా వ్యాధిగ్రస్తులు దూరంగా ఉండాలి.
పుల్లటి వస్తువులు, పులియబెట్టిన ఆహారాలు తింటే శ్వాస వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయి. ప్రిజర్వేటివ్ ఫుడ్ కి కూడా దూరంగా ఉండాలి. టీ, కాఫీ లు అలవాటు ఉన్నవారు అధికంగా తాగకూడదు. వాటి వల్ల గ్యాస్ ఉత్పన్నమై.. అది ఆస్తమా పెరుగుదలపై పరోక్ష ప్రభావం చూపుతుంది.
బీన్స్, పాలపదార్థాలు, వెనిగర్, పచ్చళ్లను కూడా ఎక్కువగా తినకూడదు. పచ్చళ్లలో ఉండే సల్ఫేట్స్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలిగిస్తాయి. శీతల పానీయాలు (కూల్ డ్రింక్స్), కూల్ వాటవ్ వంటి వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు. ఎప్పటికప్పుడు కాచిన నీటినే తాగుతుండాలి. ఆస్తమా ఉన్నవారు ఇన్ హెలర్ కు అలవాటు పడకుండా చూసుకోవాలి.
అది అందుబాటులో లేనపుడు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ. అత్యవసరమైతేనే ఇన్ హెలర్ ను ఉపయోగించేలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రతిరోజూ ప్రాణాయామం చేస్తే.. ఈ సమస్యను నుంచి కాస్త ఉపశమనం ఉంటుంది.