Health

ఈ దోమలు చాలా ప్రమాదకరం, ఒక్కసారి కుడితే కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉంది.

సాధారణంగా దోమలు రాత్రిపూట మాత్రమే కుడతాయి. కానీ ఎల్వా ఆల్బోపిక్టస్ దోమ పగటిపూట, రాత్రిపూట కుడుతుంది. ఒకానొక సందర్భంలో ఇది మరింత వింతగా ఉంటుంది. దోమలు మనుషుల రక్తాన్ని తాగుతాయి. మానవులే దాని మొదటి ఎంపిక. కానీ ఒక వ్యక్తి రక్తం అందుబాటులో లేకుంటే.. ఈ ఆసియన్ దోమ జంతువు రక్తాన్ని కూడా తాగుతుంది. ఇప్పుడు ఈ దోమలు యూరప్ దేశాలతో పాటు అమెరికాకు కూడా వ్యాపించాయి.

అయితే దోమలు మనల్ని కుట్టి మన రక్తాన్ని పీల్చడమే కాకుండా మనకు అనేక వ్యాధులను వ్యాపింపజేస్తాయి. దోమలు చాలా రకాలు ఉంటాయి, ఇందులో ఆసియన్ టైగర్ దోమ లేదా ఏడెస్ ఆల్బోపిక్టస్ అనే దోమ చాలా ప్రమాదకరమైనది. ఇది ముఖ్యంగా మనుషులకు అప్పుడప్పుడు ఇతర క్షీరదాలకు కాటు వేసి రక్తాన్ని పీలుస్తుంది. ఇది కుట్టినపుడు ఆ భాగంలో వాపు, ఆ తర్వాత గడ్డలాగా తయారవుతుంది. దీనిని తొలగించడానికి కొన్నిసార్లు సర్జరీ లేదా చర్మాన్ని తొలగించడం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని కాటు ద్వారా ప్రాణాంతకమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించగలదు.

అది ఇన్ఫెక్షన్ కలిగించడానికి కారణమవుతుంది. యూకే మీడియా డైలీ స్టార్ నివేదిక ప్రకారం, ఆసియా టైగర్ దోమ కాటుకు గురైన జర్మనీకి చెందిన ఓ 27 ఏళ్ల యువకుడు కోమాలోకి వెళ్లాడు. ఈ దోమ కాటుతో ఇన్ఫెక్షన్ అయి అతడికి 30 సర్జరీలు చేయాల్సి వచ్చింది. వైద్యులు రెండు కాలివేళ్లు కత్తిరించారు, అంతేకాదు తొడలో మాంసం మొత్తం తొలగించాల్సి వచ్చింది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ప్రమాదకరమైన దోమ అని. ఈ ఆసియా టైగర్ దోమలు అనేవి అడవి దోమలు. ఇవి పట్టణ వాతావరణంలోనూ వృద్ధి చెందుతాయి.

ఇవి వాస్తవానికి ఆగ్నేయాసియా ప్రాంతానికి చెందినవి. కానీ ఇప్పుడు అంతర్జాతీయ ప్రయాణాలు పెరగటం, సరుకు రవాణా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈ దోమలు వ్యాపించాయి. ఈ దోమలు వాటి తల, వెనక భాగంలో తెలుపు, నలుపు గీతలు లేదా చుక్కలను కలిగి ఉంటాయి. పులికి ఇలాగే ఉంటాయి కాబట్టి దాని ఆధారంగా వీటికి టైగర్ దోమలు అనే పేరు వచ్చింది. ఇవి సాధారణంగా పగటివేళలో కాటు వేస్తాయి. కాబట్టి ఇటువంటి దోమల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శరీరానికి దోమల వికర్షకాలు పూసుకోవడం, దోమల నివారణ చర్యలు తీసుకోవడం చేయండి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker