Health

ఆస్తమా ఉన్నవారు ఈ రోజుల్లో ఎలాంటి జాగర్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

ఆస్తమా వ్యాధి మూలంగా శ్వాస నాళాలు పూర్తిగా సంకోచించి వాపు మూలంగా శ్లేష్మం ఎక్కువగా తయారై ఊపిరి తీసుకోవ‌డం ఇబ్బందిగా మారుతుంది. వాతావరణంలోని ఎలర్జీ కలిగించే పదార్ధాల కారణంగా ఎక్కువ శాతం జరుగుతూ ఇలా జ‌రుగుతుంది. అయితే ఆస్తమా సమస్య ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అయితే ఇది చలికాలం కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఆస్తమా సమస్యతో బాధపడే వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. చలికాలంలో శ్వాస సంబంధ సమస్యలు వంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. పండ్లు.. ఈ పండ్లను తీసుకుంటే ఆస్తమా సమస్య నుండి బయటపడొచ్చు. ఆపిల్ ని తీసుకుంటే ఆస్తమా లక్షణాలు తగ్గుతాయి. అలానే స్ట్రాబెరీస్ కమల పండ్లు తీసుకుంటే కూడా ఆస్తమా సమస్య తగ్గుతుంది.

బీటా కెరోటిన్.. బీటా కెరోటిన్ ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆస్తమా ఉన్నవారికి ఎంతో మంచి కలుగుతుంది. క్యారెట్లు, చిలకడ దుంపలు, మునగాకు, బొప్పాయి వంటివి తప్పకుండా తీసుకుంటూ ఉండండి. విటమిన్ డి.. ఇది కూడా ఆస్తమా ఉన్న వాళ్ళకి మంచిది. పాలు, గుడ్లు, చేపలు వంటి వాటిలో ఇది ఉంటుంది కాబట్టి కచ్చితంగా వాటిని కూడా తీసుకోండి.

మెగ్నీషియం.. మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే ఆస్తమా ఉన్నవారికి మంచిది. గుమ్మడి గింజలు, డార్క్ చాక్లెట్, బ్రోకలీ, బ్రౌన్ రైస్, మొలకలు, పచ్చి బఠానీ వంటి వాటిలో ఇది ఉంటుంది. ఈ ఆహారాన్ని అసలు తీసుకోకండి.. ఆస్తమా ఉన్నవాళ్లు జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. అలానే ఊరగాయలు స్వీట్లు కూడా తీసుకోవద్దు. ఆస్తమా ఉన్నవారు కూల్ డ్రింక్స్ కి దూరంగా ఉండటం మంచిది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker