ఈ మొక్కని ఇలా చేసి వాడితే 100కు పైగా రోగాలను నయం చేయగలదు.

అతిబల చెట్టు.. దీనినే దువ్వెన బెండ, ముద్ర బెండ, అతి బల, తుత్తురు బెండ లేదా దువ్వెన కాయ అని రకరకాలుగా పిలుస్తారు. ఈ మొక్కను చాలా వరకు అందరూ చూసే ఉంటారు. ఈ మొక్క అందరికీ తెలిసినప్పటికి.. ఇందులోని ఔషద గుణాలు మాత్రం ఎక్కువ మంది కు తెలియదు.. ఈ మొక్క అమితమైన బలం ఇస్తుంది. అయితే ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధ మొక్కలను ఇచ్చింది. మనం వాటిని ఉపయోగించుకోవడం లేదు. అంతా ఆంగ్ల మందులకు అలవాటు పడ్డారు. పూర్వం రోజుల్లో చెట్లు, ఆకులతోనే రోగాలను నయం చేసేవారు.
దీంతో వారికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండేవి కావు. కాలక్రమంలో మనం ఇంగ్లిష్ వైద్యానికి ఆకర్షితులమయ్యాం. దీంతో మన పూర్వీకులు సూచించిన ఆయుర్వేద వైద్యాన్ని మరిచిపోతున్నాం. ఫలితంగా అనేక రోగాలకు నెలవుగా మారుతున్నాం. అయినా మనలో మార్పు రావడం లేదు. మన ప్రకృతి మనకు ఎన్నో రకాల ఔషధ మొక్కల్ని ఇచ్చింది. వాటిని వాడుకుంటే మనకు రోగాల ముప్పే ఉండదు. మన గ్రామీణ ప్రాంతాల్లో విరివిగా కనిపించే చెట్టు అతిబల. దీంతో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఒక కలుపు మొక్క. వేడి ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. దీని ఆకులు చూడటానికి గుండ్రంగా ఉంటాయి.
దీని అన్ని భాగాలు మనకు మందులా ఉపయోగపడతాయి. శీఘ్ర స్కలన సమస్యకు..దీని ఆకులు మగవారిలో ఏర్పడే శీఘ్రస్కలన సమస్యకు చెక్ పెడతాయి. ఇన్నాళ్లు మీరు శృంగారంలో బలహీనంగా ఉంటే దీని ఆకులతో రేసుగుర్రంలా మారొచ్చు. రెచ్చిపోవచ్చు. శృంగారాన్ని ఆస్వాదించొచ్చు. ఇంకా శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి. కీళ్లనొప్పులు, కాళ్ల నొప్పులకు కూడా మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఇంతటి మహత్తరమైన చెట్టును ఎక్కడైనా మనకు కనిపిస్తే వెంటనే దాని ఆకులు తీకుని వాడుకుంటే మనకు ఆరోగ్యంగా బాగుంటుంది. ఈ వ్యాధుల నివారణకు మంచి మందులా అవుతుంది.
అతిబల చెట్టు ఆకులు ఇంతటి ప్రాధాన్యం కలిగి ఉన్నాయనే సంగతి మనకు ఇప్పటి వరకు తెలియకపోవడం మన దురదృష్టం. ఎలా వాడుకోవాలి? అతిబల చెట్టు ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి నీటిలో వేసి మరిగించుకోవాలి. తరువాత వడకట్టుకుని అందులో కొద్దిగా కండచక్కెర వేసుకుని తీసుకుంటే పైన చెప్పిన సమస్యలను దూరం చేస్తుంది. శరీరానికి వేడి చేసినప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తుంది. దీని ఆకుల కాషాయంతో కండ చక్కెర కలుపుకుని తాగితే కీళ్ల నొప్పులు కూడా పోతాయి. పక్షవాతం వచ్చినప్పుడు దీని ఆకులు తీసుకుని పేస్టులా చేసుకుని అందులో ఆవనూనె కలిపి నొప్పులు ఉన్న చోట రుద్దితే తగ్గుతాయి.
వాపులను తగ్గిస్తుంది.. చర్మంపై వచ్చే వాపులకు కూడా ఇది మంచి మందు అవుతుంది. వాపులను తగ్గించడానికి సాయపడుతుంి. దీని ఆకులను తీసుకుని ఉడికించి వాపు ఉన్న చోట కట్టాలి. వాపు వెంటనే తగ్గుతుంది. శరీరంపై గాయం లేదా పుండ్లు ఏర్పడినా దీని ఆకులను పేస్టులా చేసుకుని రాయడం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఏదైనా జంతువు కుక్క, కోతి, పిల్లి లాంటివి కరిచినప్పుడు కూడా దీని ఆకుల రసాన్ని రెండు స్పూన్లు వాటిపై పిండి ఆకులను కట్టు కడితే ప్రథమ చికిత్సగా ఉపయోగపడుతుంది. ఇలా అతిబల మనకు ఉపయోగపడుతుంది.