Health

అరకప్పు పాలలో కొంచం ఈ పొడి వేసుకొని తాగితే చాలు, మీ శక్తి రెట్టింపు అవుతుంది.

అతిమధురం..ఇదో శక్తిమంతమైన ఔషధంగా కూడా గుర్తింపు పొందింది. అందుకే ఆయుర్వేదంలో మొదటి స్థానం దీనిదే. హిందీలో దీన్ని ములేతీ అంటారు. ఈ మొక్కలో గ్లయిసిరైజిక్‌ యాసిడ్, గ్లూకోజ్‌, సుక్రోజ్‌, యాస్పిరాజిన్, ఈస్ట్రోజెన్‌, స్టిరాయిడ్‌, సుగంధిత తైలం వంటివి ఉన్నాయి. మీకు ఆయుర్వేద షాపుల్లో ఈ మొక్క వేర్లు లభిస్తాయి. ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను నివారించ‌డంలో అతి మ‌ధురం అద్భుతంగా స‌మాయ‌ప‌డుతుంది. మన శరీరానికి అత్యవసరమైన గ్లూకోజ్,ఫక్టోజ్, సుక్రోజ్ వంటి చక్కెరలు అతిమధురం మూలికలో ఉన్నాయి.

అంతేకాదు స్త్రీ శరీరానికి ఎంతో కీలకమైన ఈస్ట్రోజన్ వంటి హార్మోన్లు కూడా అతిమధురం లో సమృద్ధిగా ఉన్నట్లు అనేక అధ్యయనాల్లో తేలింది. నోటి దుర్వాస‌న‌, నోటి పూత‌, దంతాల నొప్పి, చిగుళ్ల నుంచి ర‌క్త‌స్రావం వంటి స‌మ‌స్య‌ల‌న్నీ దూరం చేయటంలో తోడ్పడుతుంది. అతిమధురంతో ఆరోగ్య ప్రయోజనాలు.. నీరసం, ఆయాసం, గుండెదడ ,మలబద్దకం వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఎండు ద్రాక్షని, అతి మధుర చూర్ణాన్ని సమాన మోతాదులో తీసుకుని బాగా దంచి ముద్దగా చేసి చిన్న చిన్న గోలీలు గా చేసి పాలతో పాటు క్రమం తప్పకుండా రోజుకు రెండు సార్లు తీసుకుంటే బాధలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ అతి మ‌ధురం పొడి, నాలుగు తుల‌సి ఆకులు, దంచిన చిన్న అల్లం ముక్క‌, అర స్పూన్ సోంపు వేసి బాగా మ‌రిగించాలి.ఆపై ఫిల్ట‌ర్ చేసుకుని తీసుకుంటే గ‌నుక జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు త‌గ్గ‌డంతో పాటు రోగ నిరోధ‌క శ‌క్తిని పెరుగుతుంది. గ్లాస్ పాల‌ల్లో ఒక స్పూన్ అతి మ‌ధురం పొడి క‌లిపి తీసుకుంటే ఎముక‌లు, కండ‌రాలు దృఢ పడ‌తాయి.సంతాన స‌మ‌స్య‌లు ఉంటే న‌యం అవుతాయి. మతిమరుపు తో బాధపడుతున్నప్పుడు, ఏకాగ్రత కుదరక ఇబ్బంది పడుతున్నప్పుడు అతిమధురం కి సరస్వతి ఆకు, పటికబెల్లం ని సమపాళ్ళలో కలిపి దాన్ని అరకప్పు పాలలో నిత్యం తీసుకుంటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు ఏకాగ్రత కూడా చక్కగా కుదురుతుంది.

అతి మధురం చూర్ణంలో వస చూర్ణం కలిపి పూటకు పావు టీస్పూన్‌ చొప్పున మూడు పూటలా తగినంత తేనెతో కలిపి తీసుకోవాలి. దీంతో దగ్గు తగ్గుతుంది. అరకప్పు పాలలో అర టీస్పూన్‌ మోతాదులో అతి మధురం చూర్ణాన్ని కలిపి సేవిస్తుంటే బాలింతల్లో పాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అతి మధుర చూర్ణంతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా మారుతాయి. పిప్పి పళ్ల సమస్య నుంచి బయట పడవచ్చు. చిగుళ్ల నుంచి రక్త స్రావం తగ్గుతుంది. నోట్లో ఉండే పుండ్లు, పొక్కులు తగ్గుతాయి. అతి మధురం, అశ్వగంధ చూర్ణాలను సమానంగా కలిపి ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూను చూర్ణం, ఒక టీస్పూను పటికబెల్లం పొడి, నెయ్యి, తేనె కలిపి రోజుకు ఒకటి రెండుసార్లు తాగాలి. ఇలా చేయటం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker