Avoid with Fish: చేపలతోపాటు వీటిని కలిపి పొరపాటున అస్సలు కలిపి తినకండి, తిన్నారో..?

Avoid with Fish: చేపలతోపాటు వీటిని కలిపి పొరపాటున అస్సలు కలిపి తినకండి, తిన్నారో..?
Avoid with Fish: చేపల్లోని పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఇందులోని లీన్ ప్రోటీన్, విటమిన్ డి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలో వీటిని మంచి మొత్తంలో తీసుకుంటే మెదడు మెరుగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది. శరీర ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ముందుంటుంది. అయితే చేపల్లో లీన్ ప్రోటీన్, విటమిన్ డి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి మెదడు పనితీరుకు, రోగనిరోధక శక్తి పెరుగుదలకు తోడ్పడుతాయి.

చేపలు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. కొన్ని ఆహారాలతో కలిపి తింటే జీర్ణ సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పాలు, పాల పదార్థాలు..చేపలతో పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులను తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, ఉబ్బరం, కడుపు నొప్పి, చర్మ వ్యాధులు, అలర్జీలు కూడా వస్తాయి. డైరీ, చేపలను కలిపి తీసుకుంటే అధిక ప్రోటీన్ కంటెంట్, జీర్ణక్రియను దెబ్బతీస్తుంది.
Also Read: భార్యాభర్తల బంధం బలపడాలంటే..!
ఆమ్ల ఫలాలు..చేపలు, సిట్రస్ పండ్లను కూడా కలిపి తినడం ప్రమాదకరం. సిట్రస్ పండ్లలో నారింజ, బత్తాయి, నిమ్మ ఇలాంటి వాటిలో యాసిడ్ ఉంటుంది. ఇది చేపలలోని ప్రోటీన్‌లతో చర్య తీసుకుంటుంది. ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలు..చేపలను అధికంగా ప్రాసెస్ చేసిన, వేయించిన ఆహారాలతో కలపడం వల్ల చేపలలోని నాణ్యత, పోషణ తగ్గుతుంది. వేయించిన ఆహారాలలో అధిక స్థాయిలో ఉండే ట్రాన్స్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి హానికరం.
Also Read: ఉదయాన్నే ఈ భాగాలలో నొప్పులు వస్తున్నాయా..?
బీన్స్, చిక్కుళ్ళు..బీన్స్, చిక్కుళ్ళు గ్యాస్ కలిగిస్తాయి. బీన్స్‌లో అధిక మొత్తంలో రాఫినోస్ అనే కాంప్లెక్స్ చక్కెర ఉంటుంది, బీన్స్‌లో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. దీనితో చేపలు కలిపి తీసుకుంటే వాతం కలిగే ప్రమాదం ఉంది.
Also Read: మీ మూత్రం వాసన వస్తుందా..?
పిండి పదార్ధాలు..బంగాళాదుంపలు వంటి పిండి పదార్ధాలతో చేపలను కలపి తీసుకోవడం వల్ల శరీరానికి అధిక కేలరీలు, కార్బోహైడ్రేట్లను అందజేస్తుంది. జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. స్పైసి ఫుడ్..స్పైసీ ఫుడ్‌తో చేపలను తిన్నప్పుడు, చేపల తేలికపాటి రుచి కొంతవరకు తగ్గుతుంది. చేపలతో పాటు చాలా స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల జీర్ణకోశ అసౌకర్యం, ఉబ్బరం కలుగుతుంది.