అయ్యప్ప స్వాములు ఇరుముడి దగ్గర పొరపాటునకూడా చేయకూడని పనులు ఇవే.
కార్తిక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు దక్షిణాపథంలో అయ్యప్పదీక్షల కోలాహలం కనిపిస్తుంది. ఒక్క రోజు చేసే వ్రతం కాదిది. ఒక్క పూట ఉండే ఉపవాసం అంతకన్నా కాదు! నలభై రోజులపాటు కొనసాగించే ఆధ్యాత్మిక సాధన. అత్యంత నియమ నిష్ఠలతో దీక్ష కొనసాగిస్తూ అలౌకిక ఆనందాన్ని పొందుతారు. నిత్యం అయ్యప్పస్వామి సేవలో తరిస్తారు. దీక్ష ముగింపులో శబరిమలకు వెళ్లి అయ్యప్పను దర్శించుకొని పవిత్రులుగా తిరిగివస్తారు. అయితే అయితే మాల ధరించిన భక్తులకు దీక్ష సమయంలో అనుసరించాల్సిన కొన్ని నియమాలు ఉంటాయి.
ఉదయం లేవగానే తల స్నానం చేసి, విభూది, గంధం తిలకం ధరించాలి. భక్తులు కేవలం నల్ల వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. ఇలాంటి నల్ల వస్త్రాలను ధరించి మాత్రమే బయటకు రావాలి. ఇతర రంగు వస్త్రాలను ధరిస్తే మనోభావాలకు విఘాతం కలగవచ్చు. ఇంతేకాక, కొత్త నల్ల వస్త్రాలనే ఉపయోగించి, ఈ దశలో ముందు ఉపయోగించిన వస్త్రాలను వేసుకోవద్దు. మాల ధరించిన తర్వాత దీక్ష సమయంలో తల వెంట్రుకలు, గడ్డం, గోర్లు కత్తిరించుకోవడం చేయవద్దు. ఇంకా ఇంట్లో రుతుక్రమం ఉన్న మహిళలను, భార్య, తల్లి అయినా వారిని కలవకూడదు. అలానే వారిని వంట లేదా ఇతర పనుల కోసం ఇబ్బంది పెట్టకుండా, దూరంగా ఉండమని చెప్పాలి.
దీనికి క్రమ పద్ధతుల్లో ఇంట్లో వేరే గది ఉన్నా లేదా ఆలయం, పీఠం వంటి ప్రదేశాల్లో ఉండవచ్చు. దీక్షలో ఉన్నప్పుడు ఎవరైనా చనిపోతే స్వాములు మృతదేహాన్ని చూడకూడదని, చనిపోయిన వారు దగ్గరి బంధువులు అయితేనే కొన్ని నియమాలు పాటించాలని చెబుతున్నారు. ముఖ్యంగా, కరోనా సమయంలో పాటించిన నియమాల్లానే, అయ్యప్ప దీక్షలో కూడా కొన్ని నియమాలు పాటించాలి. మనం అనుకోకుండా మార్గమధ్యంలో మృతదేహం చూడాల్సి వచ్చినా వెంటనే స్నానం చేసి, అలంకరణ దిద్దుకుని, స్వామికి హారతి ఇచ్చి ప్రార్థనలు చేసుకోవాలని సూచిస్తున్నారు.