బేబీ బంప్ తో మొత్తానికి అసలు విషయం చెప్పిన ఇలియానా.

గతంలో ఇలియానా ఆస్ట్రేలియన్ వ్యక్తితో డేటింగ్ చేసింది. 2019లో అతడితో విడిపోయింది. అప్పటి నుండి ఆమె సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్నారు. సడన్ గా ఇలియానా గర్భం దాల్చడంతో ఆమె సింగిల్ కాదని తేలిపోయింది. ఓ అంచనా ప్రకారం కత్రినా కైఫ్ బ్రదర్ సెబాస్టియన్ కారణంగా ఇలియానా తల్లి అయ్యారనే ప్రచారం జరుగుతుంది. ఇక ఇలియానాకు నెలలు దగ్గరపడ్డాయి. ఆమె బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుంది.
బహుశా ఇలియానాకు 7 నెలలు దాటి ఉండవచ్చు. మరి ఇలియానాకు పుట్టేది అబ్బాయా అమ్మాయా? అనే సందేహాలు ఉన్నాయి. దీనిపై ఆమె ఓ హింట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇలియానాకు పుట్టబోయేది అమ్మాయే అంటున్నారు కొందరు. అయితే కెరీర్ ఆరంభించిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్లో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్‌కు మకాం మార్చింది.
అయితే తెలుగుతో పోలిస్తే అక్కడ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. దీంతో కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవలే సోషల్ మీడియాలో తాను గర్భం ధరించినట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావడంతో అవాక్కయ్యారు. తాజాగా మరోసారి తన బేబీ బంప్‌ను ప్రదర్శించింది ముద్దుగుమ్మ.
మిర్రర్ ముందు సెల్ఫీ దిగుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ‘ఇట్స్ ఆల్ ఏబౌట్ ఎంజెల్స్’ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. అంటే పరోక్షంగా ఆమెకు పుట్టబోయే బిడ్డ గురించి హింట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇలియానాకు పుట్టబోయేది కూతురే అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇలియానా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ బిడ్డకు తండ్రి ఎవరన్న దానిపై జోరుగా చర్చ నడుస్తుంది.
గతంలో హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా రిలేషన్షిప్లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వీరిద్దరూ కలిసి కత్రినా, విక్కీలతో కలిసి మాల్దీవులకు వెకేషన్‌కు వెళ్లారు. కానీ ప్రెగ్నెన్సీ బయటపెట్టినా ఇంతవరకు తన రిలేషన్ షిప్ స్టేటస్ మాత్రం ఇలియానా రివీల్ చేయకపోవడం గమనార్హం.