Health

పురుషులు ఖచ్చితంగా తినాల్సిన ఆకుకూర ఇది. అద్భుత శక్తితో పాటు..?

బచ్చలికూర తినడం వల్ల మెదడు ఆరోగ్యం బాగుంటుంది.. ‘బచ్చలికూర తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఇందులో విటమిన్-ఏ, లుటిన్, కెరోటిన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలు మెదడు డ్యామేజిని ఆలస్యం చేస్తుంది’ అని న్యూ మెక్సికో స్టేట్ వర్సిటీలో ప్రజారోగ్య ప్రొఫెసర్ పీహెచ్ డీ జగదీశ్ ఖుబ్ చందాని అన్నారు. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పురుషుల భుజాలపై బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి.

అందుకే చాలాసార్లు వారు తమను తాము సరిగ్గా గమనించక అనారోగ్యానికి గురవుతుంటారు. ప్రస్తుత కాలంలో పురుషులు రోజువారీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. తద్వారా వారి శరీరం లోపల నుంచి బలంగా తయారవుతుంది.పురుషులు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకు కూరలు తప్పనిసరిగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా బచ్చలికూరను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. దీనివల్ల శరీరానికి చాలా పోషకాలు లభిస్తాయి.

ఇది వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి దీన్ని తినడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శక్తికి, రక్తానికి లోటు ఉండదు. ఈ గ్రీన్ వెజిటేబుల్లో విటమిన్-కె కూడా లభిస్తుంది. ఇది శరీరంలోని కాల్షియంను గ్రహించి, ఎముకలను దృఢంగా చేస్తుంది. బచ్చలికూరలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది అనేక వ్యాధులను దూరం చేస్తుంది.

అలాగే మొత్తం శరీర పెరుగుదలకు సహాయపడుతుంది. బచ్చలికూర తినడం వల్ల శరీరానికి విటమిన్-ఎ అందుతుంది. దీనివల్ల కంటిచూపు పెరుగుతుంది. బచ్చలికూర తినడం వల్ల మెగ్నీషియం, జింక్ అందుతాయి. దీని కారణంగా శరీరం రిలాక్స్‌గా ఉంటుంది. బచ్చలికూర మానసిక ఆరోగ్యానికి అద్భుతమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి దీనిని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవాలి. బచ్చలికూర తిన్న తర్వాత మీకు త్వరగా ఆకలి అనిపించదు. దీని వల్ల శరీరం ఫిట్‌గా ఉంటుంది, బరువు ఎక్కువగా పెరగరు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker