మీ వీపు కింది ఇలా హోల్స్ ఉన్నాయా..? అలా ఉంటె ఏమవుతుందో తెలుసా..?
నడుము వెనక భాగం లోను, పిరుదుల పై భాగం లోను రెండు గుంతల్లాంటి రంధ్రాలు ఉన్నవారు చాల అదృష్టవంతులట. ఇవి కొందరికి పుట్టుక తోనే వస్తాయట. వీటిని మీకు ఉన్నాయేమో ఎపుడైనా గమనించారా? ఇవి ఉన్న వారు అదృష్టవంతులట. ఈ రంధ్రాలను రోమన్లు వీనస్ అనే వారి దేవతకు చెందిన రంధ్రాలుగా చెబుతుంటారు.
అయితే వీపు కింది భాగంలో వెన్నెముకకు ఇరువైపులా రెండు రంధ్రాల మాదిరిగా ఉంటే వాటిని వీనస్ హోల్స్ అని లేదా అపోలో హోల్స్ అని అంటారు. రోమన్ దేవత వీనస్ అందానికి, కోరికలకు, సంతానానికి, శృంగారానికి, సంపదకు, విజయాలకు ప్రతీకగా చెబుతారు. అయితే ఇలాంటి హోల్స్ ఉన్నవారికి రోమన్ సంప్రదాయం ప్రకారం లక్ కలసి వస్తుందట.
వారు ధనవంతులు అవుతారట. పట్టిందల్లా బంగారమే అవుతుందట. ఏ పని చేసినా విజయం సాధిస్తారట. అనుకున్న కోరికలు నెరవేరుతాయట. ఇక ఇలాంటి వారి దాంపత్య జీవితం అన్యోన్యంగా ఉంటుందట. చక్కని సంతానం కలగడంతోపాటు ఆరోగ్యంగా కూడా ఉంటారట. అలాగే శృంగారంలోనూ చురుగ్గా పాల్గొంటారట. ఇలాంటి రంధ్రాలు కలిగిన స్త్రీ లేదా పురుషుడు ఎవరైనా సరే.. ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారట.
ఇలా ఈ రంధ్రాలు అనేక విధాలుగా అదృష్టాన్ని తెచ్చి పెడతాయని రోమన్లు ఇప్పటికీ విశ్వసిస్తారు. అయితే ఈ వీనస్ హోల్స్ జన్యు పరంగా ఏర్పడుతాయి. వంశ పారంపర్యంగా కూడా ఏర్పడేందుకు అవకాశాలు ఉంటాయి. కొందరికి యాదృచ్ఛికంగా కూడా ఇవి వస్తాయి. కానీ వీటిని యోగా, వ్యాయామం, జిమ్ వంటివి చేసి తెప్పించలేము. పుట్టుకతోనే ఇవి రావల్సి ఉంటుంది. అలాంటి వారు నిజంగా అదృష్టవంతులే అని చెప్పవచ్చు.