Health

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగింది అని ఎలా తెలుస్తుందో తెలుసా..?

మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం ద్వారా బ్లడ్ కొలెస్ట్రాల్ లో చెడ్డ కొలెస్ట్రాల్ ను అదుపు చెయ్యవచ్చు. ప్రతిరోజూ సైక్లింగ్, నడక, ఈత వంటి తెలికపాటి వ్యాయామాలు చెయ్యాలి. దీనివలన గుండె పటిష్టపడుతుంది. చెడ్డ కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుంది. అధిక బరువు మాయమవుతుంది. రక్త నాళాలలో వాపు, క్లాగింగ్ తగ్గి, రక్తనాళాల గోడలు దలసరికాకుండా వుంటాయి. అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి.

వీటిలో బరువు పెరగడం, మద్యం సేవించడం, ధూమపానం, వ్యాయామం లేకపోవడం, కొవ్వు పదార్ధాలు తినడం వంటివి ముఖ్యంగా ఉన్నాయి. కానీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో తెలుసుకోవడం ఎలా అనేది ప్రజలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య. ఈ వ్యాధి లక్షణాలను గుర్తెరిగి ఉంటే ఈజీగా తెలుసుకోవచ్చ. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరగడం అనేది సాధారణంగా తెలియదని వైద్యులు చెప్తున్నారు.

కొన్ని నిర్దిష్ట లక్షణాల ద్వారా మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుదల గురించి తెలుసుకోవచ్చు. ఈ లక్షణాలలో చేతులు, కాళ్ళలో తిమ్మిరి , విపరీతమైన అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటు, వికారం, శరీరంలో తిమ్మిరి వంటివి మెయిన్‌గా ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిన లక్షణాలు కనిపిస్తే వెంటనే మంచి వైద్యులను సంప్రదించి రక్తపరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్ష ద్వారానే మీ శరీరం సరిగ్గా పని చేస్తుందో లేదో తెలుసుకోవచ్చు.

11 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ పొందాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 45 నుండి 65 సంవత్సరాల వయస్సు గల పురుషులు, 55 నుంచి 64 సంవత్సరాల వయస్సు గల స్త్రీలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి రక్త పరీక్ష చేయించుకోవాలట.. కొలెస్ట్రాల్‌ స్థాయిను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటే ఎన్నో రోగాలకు ముందుగానే అడ్డుకట్ట వేయొచ్చు.!

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker