మనుషుల మధ్య బంధాలు బలపడాలంటే చాణక్య ఏం చెప్పాడో తెలుసా..?
చాణక్యుడికి రాజకీయాలే కాకుండా సమాజానికి సంబంధించిన ప్రతి విషయంపై లోతైన జ్ఞానం ఉంది. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే పుస్తకంలో ఆర్థిక విషయాలు, సంబంధాలు తదితర విషయాల గురించి ప్రస్తావించాడు. ఆచార్య చాణక్య తక్ష శిలలో అధ్యాపకుడిగా పనిచేసేవారు. సమాజం పట్ల, మనిషి నడవడిక పట్ల మంచి అవగాన ఉన్న వ్యక్తి. చాణుక్యుడు సమాజంలో మనిషి జీవించాల్సిన పద్దతిని.. రాజ్య పాలన, ప్రజల సుఖ సంతోషాలు, మనిషి నడవడిక వంటి అనేక విషాలను వివరించారు.
అయితే ఆచార్య చాణక్యుడు మనుషుల మధ్య సంబంధాలు కలకాలం నిలవాలంటే ఏం చేయాలనేదానిపై వివరించాడు. ప్రస్తుతం మనుషుల మధ్య సంబంధాలు అంతరిస్తున్నాయి. మానవ సంబంధాలు కాస్త ఆర్థిక బంధాలుగా మారుతున్నాయి. డబ్బులుంటే ఒకలా డబ్బు లేకపోతే మరోలా చూస్తున్నారు. డబ్బు లేని వారిని పేదవారుగా గుర్తించి వారికి కనీస సాయం కూడా చేయడం లేదు. ఈ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని మనీ సంబంధాలుగా మారిపోతున్నాయి.
డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలున్నాయి. సక్రమమైన మార్గాల్లో డబ్బును ఆదా చేస్తే ధనవంతులు అవుతారు. పెట్టుబడి పెట్టి లాభాలు గడిస్తే ధనవంతులు కావొచ్చు. కానీ సరైన మార్గంలోనే పెట్టుబడి పెట్టాలి. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు ఆకర్షితులుగా మారితే ఇబ్బందులొస్తాయి. అందుకే డబ్బును ఎప్పుడు కూడా మంచి పద్ధతుల్లోనే సంపాదించాలి. అప్పుడే మనకు విలువ పెరుగుతుంది.
సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. బంధాలు బలపడాలంటే..బంధాలు బలపడాలంటే ఇద్దరి మధ్య నమ్మకం ఉండాలి. అది భార్యాభర్తలైనా ప్రేయసి ప్రియులైనా ఇద్దరి మధ్య మంచి విశ్వాసం కుదరాలి. అప్పుడే ఇద్దరు కలకాలం విడదీయకుండా ఉంటారు. వారి మధ్య అనుమానం తలెత్తితే అంతే సంగతి. ఇద్దరు విడిపోవడం ఖాయమే. ఈ నేపథ్యంలో నమ్మకమనే ఇరుసు మీదే బంధాలు అనే బండ్లు నడుస్తున్నాయని చాణక్యుడు చాటిచెప్పాడు.
భాగస్వామికి స్వేచ్ఛ బంధం బలంగా ఉండాలంటే భాగస్వామికి స్వేచ్ఛ ఇవ్వాలి. వారికి స్వాతంత్ర్యం ఇవ్వకపోతే వారు మన మాట వినరు. ఫలితంగా బంధాలు బలపడవు. వారికి మనం కావాల్సిన స్వేచ్ఛ ఇస్తే వారు కూడా తమ కోరికలు తీర్చుకుంటారు. మనతో కలకాలం ఉండేందుకు ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో బంధాలు బలోపేతం కావాలంటే చాణక్యుడు సూచించిన మార్గాలు పాటించడంతో మనకు మేలు కలుగుతుంది.