Health

బాత్‌రూమ్‌ లో ఈ తప్పులు అస్సలు చేయకండి. తెలియక చేస్తే..?

అందరూ వంటగది, పూజా గది, బెడ్ రూమ్‌ పైనే దృష్టి పెడతారు. కానీ, ఇంట్లో బాత్రూమ్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. అదే చాలా మంది చేసే పెద్ద తప్పు ఇదే. బాత్రూమ్ వ్యక్తి జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వాష్‌రూమ్‌లో ఉంచిన వస్తువులు వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. అయితే మనం ఎంత పరిశుభ్రంగా ఉన్నా అనేక ఆరోగ్యసమస్యలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం అపరిశుభ్రత. మనం ఇంట్లో, బయట ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం. కొంతమంది ఇంట్లో అస్సలు శుభ్రంగా ఉండరు. అలాగే కొన్ని తెలియని పొరపాట్లు చేస్తూ అనేక వ్యాధులను కొని తెచ్చుకుంటారు.

ముఖ్యంగా బాత్‌రూమ్‌ లలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే..బాత్‌రూమ్‌ లలో రకరకాల క్రిములు నివసిస్తూ మనల్ని అనారోగ్య బారిన పడేలా చేస్తాయి. కాబట్టి మనం అప్రమతంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి బాత్ రూమ్ లో చేయకూడని పొరపాట్లు ఇంట్లో ఇప్పుడు తెలుసుకుందాం.. ప్రస్తుతం మనలో చాలామంది బాత్‌రూమ్‌లో టూత్‌బ్రష్‌ ఉంచి మర్చిపోతుంటారు. దీనివల్ల ఆ వాతావరణంలో హానికర బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఒకవేళ ఆ బ్రష్‌తో పళ్ళను శుభ్రం చేసుకున్నట్లయితే ప్రమాదం పొంచివున్నట్టే. ఇంకా ఒళ్లు రుద్దుకునే పీచు లేదా స్క్రబర్‌ని కనీసం రెండు వారాలకోసారి శుభ్రపరచాలి.

బాత్‌రూమ్‌లో సెల్‌ఫోన్‌ వాడకం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఫోన్ వాడే క్రమంలో ఆ గదిలోని హానికర సూక్ష్మక్రిములు ఫోన్‌ ఉపరితలం మీద చేరతాయి. దీనిఫలితంగా రకరకాల ఇన్ఫెక్షన్లు కలిగి అనారోగ్యం బారిన పడతారు. ఈ విషయాలు మనకు చిన్నవే అనిపించిన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరికొంతమంది బాత్ రూమ్ లోకి చెప్పులు లేకుండా వెళతారు. దానివల్ల క్రిములు కాళ్లతోనే ఇంట్లోకి వచ్చే ప్రమాదం ఉంది.

కాబట్టి బాత్ రూమ్ నుండి బయటకు రాగానే సబ్బుతో కాళ్లు, చేతులు కడుక్కోవడం మంచి అలవాటు. అందుకే బాత్ రూమ్ ఉపయోగం పట్ల నిర్లక్ష్యం వహిస్తే రోగాల బారిన పడే అవకాశం ఉంది. అలాగే బాత్ రూమ్ ఎప్పటికి తడిగా ఉండడం వల్ల క్రిములు ఎక్కువగా వుండే ప్రమాదం ఉంది. బాత్ రూమ్ ను ఎంత శుభ్రం చేసిన కానీ తడి ప్రదేశంలో బ్యాక్తీరియా ఉంటుంది. అలాగే రూమ్ లోని డోర్ హ్యాండిల్, అలాగే మిగతా వస్తువులపై బాక్టీరియా నిలువ ఉంటుంది. అలాగే బాత్ రూమ్ లో ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు. ముఖ్యంగా 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు బాత్ రూమ్ లో ఉండడం ప్రమాదమే అని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker