Health

బాత్ రూమ్ లోనే గుండెపోటు ఎక్కువగా రావడానికి కారణం ఇదే.

సమాజంలో మంచీ చెడూ ఉన్నట్లే మన శరీరంలో కూడా మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉంటాయి. వీటివల్ల గుండె జబ్బులేగాక, మూత్రపిండాల వ్యాధి, పక్షవాతం, వచ్చే అవకాశాలున్నాయి. ఈ రోజుల్లో ఎక్కువమంది కి వస్తున్న జబ్బు గుండెపోటు. ఇది ఎప్పుడు వస్తుందో అనేది చెప్పడం చాలా కష్టం. గుండె జబ్బులు ఉన్న వారు ఎక్కువగా బాత్రూం లో ఉన్న సమయంలోనే హార్ట్ ఎటాక్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

ఎన్ సీ బి ఐ మార్కెటింగ్ ఏజెన్సీ రిపోర్ట్స్ ప్రకారం 11 శాతం హార్ట్ ఎటాక్ లు బాత్ రూమ్ లో ఉన్న సమయంలోనే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో యువకులకు కూడా గుండెపోటు రావడం అనేది ఆందోళన కలిగిస్తున్న అంశం. పాతికేళ్ళు కూడా రాకుండానే గుండెపోటు మరణాలు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు కూడా గుండెపోటు తో మరణించడం ఆందోళన కలిగించే అంశం.

అయితే చాలా మందికి బాత్ రూమ్ లో ఉండగానే గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండెపోటు అర్ధ రాత్రివేళ వస్తుంది. దానికి ముందు మూత్రం పోసుకోడమో, విరేచనం కావడమో ఏదొకటి జరుగుతుంది. ఇదే ప్రమాదానికి ముందు సూచన అన్నట్టు. బాత్రూమ్ లోనే గుండెపోటుతో కుప్ప కూలిపోతారు.

ముందుగా ఎడమభుజం, మెడవెనుక, ఛాతీ కండరాలలో నొప్పి ఎక్కువగా వస్తుంది. అయితే దీన్ని ఎసిడిటీ అని పట్టించుకునే అవకాశం ఉండదు. అయితే రోగి కంటే ఇంట్లో ఉండేవారికి ఈ విషయంలో ఎక్కువ అవగాహన ఉండాలి. అమెరికాలో స్కూలుపిల్లకు కూడా ఈ విషయాలు తెలుసు. ఇక మనం స్నానం చేసేటప్పుడు వేడి నీళ్ళు నేరుగా శరీరం పైన పోసుకుంటే రక్త ప్రసరణ వేగవంతమై గుండె మీద అధిక ఒత్తిడి పడే అవకాశం ఉంది.

ముందుగా కొదిగా కాళ్ళ మీద పోసుకుని తర్వాత స్నానం చెయ్యడం మంచిది. లేచిన వెంటనే బాత్ రూమ్ లోకి వెళ్ళకుండా కాస్త సమయం తీసుకుని వెళ్ళాలి. గుండె మీద, రక్త ప్రసరణ మీద కంట్రోల్ ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker