Health

ఈ పండు తింటే మీరు ఎప్పుడూ నిత్య యవ్వనంగా ఉంటారు.

ఆప్రికాట్ పండు యొక్క మూలం చైనా అయినా కాల క్రమేణా అక్కడి నుంచి వివిధ దేశాలను వ్యాప్తి చెందింది. ఇది చాలా రుచికరంగా ఉంటుంది మరియు ఈ పండు ను ఫ్రెష్ గా ఉన్నప్పుడు, ఎండిన తరవాత డ్రై ఫ్రూట్ లాగా మరియు జామ్ లాగా కూడా తింటారు. ఈ పండు లో ఉండే పోషకవిలువలు పలు రకాల రోగాల నుంచి కాపాడటంలో కూడా సహాయపడుతుంది. అయితే ఆప్రికాట్‌లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇందులో ఫైబ‌ర్, క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, ఐరన్, విటమిన్ సీ పుష్కలంగా ఉన్నాయి. శ‌రీరానికి కావాల్సిన అనేక న్యూట్రీషియన్స్ అందిస్తుంది. ప‌లు ర‌కాల వ్యాధులను కూడా నివారిస్తోంది. డ్రై ఆప్రికాట్‌తో కూడా ప్రయోజనమే..పండు మాత్రమే కాదు, డ్రై ఆప్రికాట్‌ కూడా ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. డ్రై ఆప్రికాట్ జ్యూస్ తీసుకుంటే చ‌ర్మ స‌మ‌స్య‌లు అన్నీ పోతాయట. ఎక్జిమా, దురద, తామర వంటి వాటిని నివారించి కాంతివంతంగా ఉండేలా చేస్తుందని నిపుణులు అంటున్నారు.

దాహార్తి స‌మ‌స్య ఉన్న వారికి ఇది మంచి పరిష్కారం అవుతుంది. ఎండిన ఆప్రికాట్‌లో అధిక న్యూట్రీషియన్స్ విటమిన్ ఏ అధికంగా ఉండి కంటి చూపున‌కు బాగా సహాక‌రిస్తుంది. డ్రై ఆప్రికాట్ పెద్ద పేగులను శుభ్రపర‌చి అందులో నిల్వ ఉన్న వ్యర్థాలను బయటకు పంపుతుంది. అలాగే మజిల్ ఫంక్షన్స్, హార్ట్ బీట్‌ను రెగ్యులేట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల.. కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

ఆప్రికాట్ మంచి కొలెస్ట్రాల్ను పెంచుతూ, చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడంలో దోహదపడుతుంది. అంతేకాకుండా ఈ పండులో ఉండే పొటాషియం శరీరంలో ఎలక్ట్రోలైట్ స్థాయిలను క్రమబద్దీకరించడంలోనూ ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి…జంక్‌ఫుడ్స్‌ తినే బదులు ఇలాంటి వాటిని తినడం వల్ల అటు ఆరోగ్యం ఇటు అందం రెండూ బాగుంటాయి. ముఖ్యంగా మహిళలకు ఈ పండు చాలా మేలు చేస్తుంది. తప్పకుండా తినేందుకు ప్రయత్నించండి మరీ.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker