తెలుగు బిగ్ బాస్ విజేత ఎవరో తెలిసిపోయింది. ఎవరంటే..?
ఈ రేస్‌లో ఫైనల్‌గా ఇద్దరు మిత్రులు రేవంత్, శ్రీహాన్‌లు మాత్రమే మిగిలారు. అయితే వీళ్లిద్దరూ టికెట్ టు ఫినాలే ఫైనల్ ఫైట్‌లో పోటీపడగా.. రేవంత్‌పై శ్రీహాన్ గెలిచి టికెట్ టు ఫినాలే అందుకుని.. సీజన్ 6 తొలి ఫైనలిస్ట్ అయ్యాడు. అయితే ఇంకో మూడు వారాల్లో బిగ్ బాస్ సీజన్ 6 ముగియనుంది. ఇంట్లో 8 మంది సభ్యులు ఉన్నారు.
వీరిలో ఐదుగురు మాత్రమే ఫైనల్ కి వెళతారు. మిగిలిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు.టికెట్ టు ఫినాలే కోసం బిగ్ బాస్ వివిధ రకాల టాస్కులు చేపిస్తున్నాడు. ఇక ఈ టాస్కులు చేయటం కోసం ఇంటి సభ్యులు కిందా మీదా పడుతున్నారు. దీని కోసం వారి మధ్య విపరీతంగా గొడవలు జరుగుతున్నాయి.నిజానికి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన మొదటి సీజన్‌లో టికెట్ టు ఫినాలే పోటీ పెట్టలేదు.
నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన రెండో సీజన్‌లో సామ్రాట్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని ఫినాలేలో మొదటగా అడుగుపెట్టాడు.కానీ విజేతగా నిలవ లేక పోయాడు. ఇక మూడో సీజన్‌లో రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే గెలుచుకుని మొదటి ఫైనలిస్టుగా నిలిచాడు. అంతేకాకుండా ఆ సీజన్ విజేతగానూ అవతరించాడు. నాలుగో సీజన్‌లో టికెట్ టు ఫినాలే గెలుచుకున్న అఖిల్ రన్నరప్‌గా నిలిచాడు.
ఐదో సీజన్‌లో శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే సాధించాడు. కాకపోతే కప్ కొట్టలేదు. ఇక ఈ సీజన్ లో టికెట్ టు ఫినాలే సాధించిన శ్రీ హాన్ కొట్టడని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.కాని శ్రీ హాన్ ను సపోర్ట్ చేసే వారు మాత్రం రాహుల్ సిప్లిగంజ్ టికెట్ టు ఫినాలే తో పాటు విజేత గా నిలుస్తాడు అని కామెంట్స్ పెడుతున్నారు. అలాగే సిరి కూడా దీని కోసం తన వంతు ప్రయత్నం చేస్తున్నదట.