News

పరమశివుడికి ప్రియమైన బిల్వపత్రం. ఈ బిల్వపత్రాన్ని ఇలా వాడితే సర్వ రోగాలకు సంజీవని..!

శివార్చనలో మారేడుకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఈ ఆకులతో పరమశివుణ్ణి పూజించడం పరిపాటి అని ప్రముఖ ఆధ్యాత్మి కవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఈ బిల్వపత్రం అపురూపమైనది. ఆకులు విశిష్ట ఆకారంలో ఉంటాయి. మూడు ఆకులు ఒకే సమూహంగా ఉన్నట్టు కనిపిస్తాయి. అలనాడు భక్తకన్నప్ప మారేడు దళాలతో శివుణ్ణి పూజించి మోక్షప్రాప్తి పొందాడు. అయితే మారేడులో విటమిన్లు ఎ, బి1, బి2, సి, ఖనిజాలు, కాల్షియం, పొటాషియం, ఇనుముతో కూడిన అనేక పోషకాలున్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో మారేడు ఆకులు తింటే బోలెడు ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మారేడు ఆకులు.. ఆరోగ్య పరంగా ఎంతో మేలు చేస్తుంది. దీనిని తినడం వల్ల గుండె జబ్బులు, కాలేయ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. ఖాళీ కడుపుతో బెల్‌పత్రి తింటే ఎన్నో ప్రయోజనాలను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మారేడు ఆకులను తీసుకుంటే, అందులో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మారేడు ఆకులలో ధమనులు గట్టిపడకుండా నిరోధించే గుణం వుంది. ఇవి గుండెను వ్యాధుల నుండి రక్షిస్తాయి. బిల్వ పత్రంలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటుతో బాధపడేవారికి మేలు చేస్తుంది.

బిల్వపత్రంలో ఉండే ఐరన్‌ రక్తంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ కౌంట్‌ను పెంచుతుంది. బిల్వ పత్రంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండటం వల్ల ఇది శరీరానికి తగినంత శక్తిని అందిస్తుంది. మారేడుతో అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తరచూ మీకు నోటిపూతతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో బెల్ పత్రి తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం మీరు నాలుగు మారేడు ఆకులు తీసుకుని పచ్చిగానే నమిలి తినవచ్చు. ఇది మీ పొట్టను శుభ్రపరచడమే కాకుండా మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. బిల్వ పత్రం అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది.

డయాబెటిక్ పేషెంట్ ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో బెల్‌పత్రిని తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులు తినటం వల్ల గ్యాస్, అసిడిటీ, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. మారేడులో ఉండే కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేయడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. జ్వరం, జలుబు, దగ్గు మరియు అలెర్జీలతో బాధపడేవారికి బెల్పత్రి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker