Health

ఇలాంటివారు ఖచ్చితంగా నల్ల ద్రాక్ష తినాలి. ఎందుకంటే..?

నల్ల ద్రాక్ష దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో పుష్కలంగా లభిస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్య.. మూడు నెలల పాటు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్, కర్కుమిన్ గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నల్ల ద్రాక్ష ఇన్సులిన్ నియంత్రణను మెరుగుపరుస్తాయి కనుక మధుమేహం నివారణలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

బ్లాక్ గ్రేప్ సీడ్ ఆయిల్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ ఉన్నాయి, ఇవి నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరచి కేశాలకు మేలు చేస్తాయి. అయితే కాలాలతో సంబంధం లేకుండా మనకు ప్రతి కాలంలో లభించే పండ్లలో ద్రాక్ష పండ్లు ఉంటాయి. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ద్రాక్ష పండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఆసియా ప్రాంతంలో ఐదు వేల సంవత్సరాల క్రితం నుంచే ద్రాక్ష పండ్ల సాగు జరుగుతోంది. ద్రాక్ష పండ్లను వైన్ తయారీ కోసం ఎక్కువగా వినియోగిస్తారు.

ద్రాక్ష పండ్లను రోజూ తీసుకుంటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అజీర్ణం సమస్యతో బాధ పడే వాళ్లు ద్రాక్ష పండ్లు తింటే ఆ సమస్య దూరమవుతుంది. ద్రాక్ష పండ్లు ఆస్తమా సమస్యతో బాధ పడే వాళ్లకు ఆ సమస్యను సులువుగా దూరం చేస్తాయి. మద్యాన్నికి బానిసైన వాళ్లు ద్రాక్ష పండ్ల రసం తీసుకుంటే ద్రాక్షలో ఉండే పొటాషియం రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు ఆల్కహాల్ పై ఆసక్తిని క్రమంగా తగ్గిస్తుంది.

రోజూ ద్రాక్ష రసం తాగే వాళ్లను దంత సంబంధిత సమస్యలు వేధించవు. కురుపులతో బాధ పడుతూ ఉంటే ద్రాక్ష రసం ద్వారా ఆ కురుపులను చాలా తక్కువ సమయంలోనే తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ద్రాక్ష కిడ్నీల్లోని రాళ్ల సమస్యను కూడా దూరం చేస్తుంది. మైగ్రేన్ సమస్యతో బాధ పడేవాళ్లకు ఆ సమస్యను దూరం చేయడంలో ద్రాక్ష రసం సహాయపడుతుంది.

ద్రాక్షలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ద్రాక్ష తీసుకునే వాళ్లలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. ద్రాక్ష చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ బారిన పడకుండా ద్రాక్ష రక్షిస్తుంది. ద్రాక్ష గుండెకు బలాన్ని చేకూర్చడంతో పాటు హృదయ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker