నల్ల జామకాయ ఎప్పుడైనా తిన్నారా..? ఒక్కసారి తిన్నారంటే.?
నల్ల జామకాయ చొక్కా నల్లగా ఉండి లోపల ఎర్రటి గుజ్జును కలిగి ఉంటుంది. సాధారణ జామ పండు తో పోలిస్తే దీంట్లో పోషకాలు రెట్టింపు.. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. నల్ల జామకాయలో విటమిన్స్, ఖనిజాలు, క్యాల్షియం, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. అయితే జామకాయలు ఆకుపచ్చ రంగులో మాత్రమే కాకుండా నలుపు రంగులో కూడా ఉంటాయి. సాధారణంగా జామ పండ్లు తినడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. షుగర్ వ్యాధితో బాధపడే వారికి దంత సమస్యలతో బాధపడే వారికి జామ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి.
నల్ల జామ పండ్ల చర్మం పైన నలుపు రంగులో ఉండి లోపల గుజ్జు ఎర్రగా ఉంటుంది. ఆకుపచ్చ రంగులో ఉన్న జామ పండ్లతో పోలిస్తే ఈ నలుపు రంగు జామ పండ్లలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. నల్ల జామకాయలలో ఖనిజాలు, విటమిన్స్, ఐరన్, కాల్షియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఈ నల్లజామ పండ్లు తినడం వల్ల శరీరంలో రక్త శాతం పెరిగి రక్తహీనత సమస్య దూరం అవుతుంది. అంతేకాకుండా ఈ నలుపు రంగు జామ పండ్లు తినడం వల్ల శరీరంలో రక్తం కూడా శుద్ధి అవుతుంది.
ముఖ్యంగా ప్రస్తుత కాలంలో అందరూ అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జామ పండ్లలో యాంటీ ఏజనింగ్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ జామపండుని తినటం వల్ల చర్మం మీద ముడతలు తొలగిపోయి యవ్వనంగా కనిపించడమే కాకుండా వృద్ధాప్య లక్షణాలు దరిచేరకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. నల్ల జామ పండ్లు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడి కంటి ఆరోగ్యాన్ని రక్షిస్తాయని నిపుణుల సూచిస్తున్నారు. ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారు ఈ నల్లటి జామ పండ్లు తినడం వల్ల ఆ సమస్య నుండి విముక్తి పొందవచ్చు.
అలాగే మగవారిని ఎక్కువగా వేధిస్తున్న ఫైల్స్ సమస్యను కూడా ఈ జామ పండ్లు తినటం వల్ల నివారించవచ్చు. నల్ల జామ పండులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వచ్చే దగ్గు జ్వరం జలుబు తలనొప్పి వంటి సీజనల్ వ్యాధులనుండి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి ఈ నల్లజామ పండ్లు తినటం అవసరం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రెండు సంవత్సరాల క్రితం బీహార్ విశ్వ విద్యాలయం లోనీ శాస్త్రవేత్తలు నాటిన ఈ నల్లని జామపండు వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.