Life Style

రెండు నిమిషాల్లో బ్లాక్ హెడ్స్ ని మటుమాయం చేసే టిప్స్.

చర్మంలో పేరుకున్న దుమ్ము కారణంగా బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనికి నూనెకూడా జత కావడంతో బ్లాక్‌హెడ్స్ ఏర్పడతాయి. బ్లాక్ హెడ్స్ ను గిల్లడం వల్ల చర్మంపై ఉన్న బ్యాక్టీరియా చర్మంలోపలికి చొచ్చుకుపోయి మరింత హాని కలిగిస్తాయి. అయితే చాలామంది ముఖం మీద మొటిమలు మచ్చలు అదేవిధంగా బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ చాలా మందిలో చాలా సాధారణంగా వస్తూ ఉంటాయి. వీటిని తీసుకోవడం కోసం రకరకాల ప్రోడక్ట్స్ ను అదేవిధంగా పార్లర్ కి వెళ్లి వేల వేల ఖర్చులు చేస్తూ ఉంటారు.

అయితే అటువంటి వారికి ఎలాంటి ఖర్చు అలాగే నొప్పి తెలియకుండా ఇంట్లోనే వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం..దీనికోసం మొదటగా మొహానికి ఆవిరి పట్టుకోవాలి. తర్వాత ఆవిరి పట్టిన లేదా వేడినీళ్లలో ఒక క్లాత్ ని ముంచి దానిని తో మసాజ్ చేసిన సరిపోతుంది. ఆ తర్వాత హెయిర్ పిన్ లేదా సారీ పిన్ వెనక భాగంతో బ్లాక్ హెడ్స్ లేదా వైట్ హెడ్స్ ని ఒత్తడం వలన చాలావరకు బయటికి వచ్చేస్తాయి. ఇంకా ఉన్నట్లయితే వాటిని తీసేయడం కోసం ఒక స్క్రబ్ ని వాడవచ్చు. ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ టూత్ పేస్ట్ ని ఒక స్పూన్ బియ్యప్పిండి, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ షుగర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ విధంగా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వైట్ హెడ్స్ అలాగే బ్లాక్ హెడ్స్ పైన పెట్టి స్క్రబ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీటితో క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. వీటిని తొలగించే పద్ధతిలో ఫోర్స్ ఓపెన్ అయి ఉంటాయి. ఫోర్స్ ఓపెన్ అయి ఉండడం వలన పింపుల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. కావున ఫోర్స్ క్లోజ్ అవ్వడం కోసం ఏదైనా ప్యాక్ ను అప్లై చేసుకోవాలి. దీనికోసం బాగా పండిన అరటిపండు తీసుకొని అరటిపండు నీ మెత్తగా స్మాష్ చేసి దానిలో ఒక చెంచా మిల్క్ పౌడర్, ఒక చెంచా గోధుమపిండి కొన్ని పాలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ఫేస్ పై పెట్టుకుని ఆరే వరకు ఉండాలి. తదుపరి నీటితో శుభ్రంగా మసాజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే క్లోజ్ అయిపోతాయి. అలాగే చర్మంపై ఉండే అన్ని రకాల సమస్యలు కూడా రిమూవ్ అయితాయి. ఈసారి నుంచి వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ సమస్యతో ఇబ్బంది పడేవారు పార్లర్కి వెళ్లి వేలవేల ఖర్చు చేయకుండా సింపుల్ గా ఇంట్లోనే ఉండే ప్రొడక్ట్స్ తో ఎలాంటి నొప్పి లేకుండా అదే విధంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వైట్ హెడ్స్ అండ్ బ్లాక్ హెడ్స్ ని తీసేసుకోవచ్చు. ఈ రెమెడీ ఎవరైనా చేసుకోవచ్చు.. ప్రతి ఒక్కరికి చాలా బాగా సహాయపడుతుంది.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker