Blood Pressure: మీకు అప్పుడప్పుడు బీపీ డౌన్ అవుతుందా..? అయితే మీరు వెంటనే చెయ్యాల్సిన పని ఇదే.

Blood Pressure: మీకు అప్పుడప్పుడు బీపీ డౌన్ అవుతుందా..? అయితే మీరు వెంటనే చెయ్యాల్సిన పని ఇదే.
Blood Pressure: సాధారణంగా బీపీ లెవల్ 120/80 mm Hg ఉండాలని వైద్య నిపుణులు చెబుతారు. మహిళల్లో 60/100 mm Hg , మగవారిలో 70/110 mm Hg కంటే తక్కువగా ఉంటే దాన్ని లోబీపీ లేదా హైపోటెన్షన్ అంటారు. లోబీపీ వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్త సరఫరా ఒక్కసారిగా పడిపోయి శరీరం షాక్‌కు గురైనట్టుగా అవుతుంది. మగవారిలో కంటే మహిళల్లో లోబీపీ సమస్య ఎక్కువగా ఉంటుంది.
Also Read: రోజు ఒక గ్లాస్ మజ్జిగ తాగితే చాలు.
ఇలా కనుక బీపీ తగ్గిపోతే గుండె, మెదడు, కిడ్నీ, ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రభావం పడొచ్చు. అందుకని లోబీపీని కూడా అస్సలు అశ్రద్ధ చేయకండి ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. చాలాసేపు మీరు ఆహారం తీసుకోకపోతే బీపీ తగ్గిపోతుంది అలాంటప్పుడు వెంటనే ఒక కప్పు కాఫీ ని తాగండి. అందులో ఉండే కెఫిన్ బీపీ ని నార్మల్ కి చేరుస్తుంది. ఇబ్బందులను దూరం చేస్తుంది. అలానే సాల్ట్ కూడా బాగా పని చేస్తుంది మీరు కొంచెం నిమ్మరసంలో సాల్ట్ వేసుకుని తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీ లభిస్తుంది.
బీపీ కూడా నార్మల్ లెవెల్ కి చేరుకుంటుంది. ఒకవేళ ఎప్పుడైనా బీపీ తగ్గితే సాల్ట్ ని కూడా తీసుకోండి నీళ్లు తాగితే కూడా బీపీ నార్మల్ కి చేరుతుంది. ఒంట్లో నీళ్లు తగ్గడం వలన బీపీ తగ్గుతుంది రోజుకి రెండు మూడు లీటర్ల నీళ్లు కచ్చితంగా తీసుకోవాలి. అప్పుడే బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. అలానే మీరు కొబ్బరి నీళ్లు నిమ్మరసాన్ని కూడా రోజులో తీసుకోవడం మంచిదే.
Also Read: ఈ ఆహారపదార్థాలు తింటే చాలు.
అందులో ఇది వేసవికాలం డిహైడ్రేషన్ వంటి సమస్యలను ఎదుర్కోవాలి అలాంటప్పుడు లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. లోబీపీ తో బాధపడే వాళ్ళు బాదం ని కూడా తీసుకోండి. నానబెట్టిన బాదం పప్పుని తీసుకుంటే కూడా బీపీ నార్మల్ కి చేరుతుంది ఇలా ఈ విధంగా మీరు బీపీ లెవెల్స్ ని నార్మల్ లోకి తీసుకురావచ్చు.