శరీరం నుంచి ఇలాంటి వాసన వస్తుందా..? మీకు ఆ వ్యాధి ఉన్నట్లే..?
ఉదర సమస్యలు, అజీర్ణం, డయాబెటిస్, పలు సమస్యల కారణంగా నోటి నుంచి వాసన వస్తుంటుంది. శరీర దుర్వాసనకు మనం పెర్ఫ్యూమ్ లను ఉపయోగించడం ద్వారా కవర్ చేయవచ్చు. కానీ నోటి దుర్వాసనను అలా అరికట్టలేం. వీటి వల్ల మనం తరచుగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సాధారణంగా శరీరం చెమట పట్టిన తర్వాత బాక్టీరియా కారణంగా దుర్వాసన మొదలవుతుంది. అయితే కొంతమంది రోజుకు రెండుసార్లు లేదా మూడుసార్లు స్నానం చేసినప్పటికీ బ్యాడ్ స్మెల్ వస్తుండటం మనం గమనిస్తూ ఉంటాం.
ఇలా చెడు వాసన వచ్చే వారు స్నానం చేసిన పావుగంట, అరగంటకి ఎక్కువగా చెమటలు పట్టి.. శరీరం నుంచి దుర్వాసన వెలువడుతుంది.. దీనికి కారణం ఏమిటంటే శరీరంలోని గార్బేజ్ ఎక్కువగా పేరుకుపోయి ఉండటం వలన.. అంటే మలమూత్ర విసర్జన సరిగా జరగకపోవడం వలన.. అయితే మానవ శరీరం నుంచి వచ్చే వాసనను బట్టి కూడా శరీరంలో ని డయాబెటిస్ లెవెల్స్ ని చెప్పవచ్చు అన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.. శరీరంలో ఎక్కువ శాతం డయాబెటిస్ ఉన్నవారికి ఇలా శరీరం నుంచి దుర్వాసన వెలువడుతుందంట. అయితే అందరిలోనూ ఇలా జరుగుతుందని చెప్పలేకపోవచ్చు అని కూడా చెబుతున్నారు.
ఎందుకంటే ఒక్కొక్కళ్ళు శరీరం తీరును బట్టి కూడా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు..! డయాబెటిస్ ఉన్నప్పుడు రక్తంలో చక్కెరను శక్తిగా మార్చడానికి శరీరంలో తగినంత ఇన్సులిన్ ఉండదు.. అప్పుడు కాలేయం కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది. ఆ సమయంలో కిటోన్స్ అనే ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి.. ఈ ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అయినప్పుడు అవి రక్తం మూత్రంలో ప్రమాదకరమైన స్థాయికి చేరుతాయి.. దీనివల్ల రక్తం ఆమ్లంగా మారుతుంది. మన శ్వాస చెమట రూపంలో శరీరం నుంచి బయటికి వెళ్తాయి.
దీనివల్ల శరీరం నుంచి చెడు వాసన వస్తుంది.. మనం శ్వాస తీసుకున్నప్పుడు పండ్ల వాసన వస్తుందని గాలి పీల్చుకున్నప్పుడు, వదులుతున్నప్పుడు కూడా ఈ పండ్ల వాసన వస్తుండదని చెబుతున్నారు. అయితే మొత్తానికి డయాబెటిస్ పేషెంట్స్ దగ్గర నుంచి పండ్ల వాసన వస్తుందని.. ఇలా అందరిలో ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము అని కూడా వైద్యులు చెబుతున్నారు.. కొందరిలో మాత్రమే ఇలా జరుగుతుందట ఒకవేళ మీ చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వారికి ఇలాంటి సమస్య ఉంటే మీరు దాన్ని గమనించి వారిని టెస్ట్ చేయించుకోమని సూచించగలరు.