Health

ఈ కాలంలో వీటి గురించి తెలిస్తే గుర్తు పెట్టుకొని మరి తింటారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్రకోలీకి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి కాబట్టే దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. వీటిలో వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలతో పాటు ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే బ్రోకలీ శీతాకాలంలో మార్కెట్లలో పెద్ద మొత్తంలో దొరుకుతుంది. గ్రీన్ క్యాబేజీ పేరుతో కూడా చాలా మందికి తెలుసు. దీనితో పాటు, వింటర్ సీజన్‌లో బ్రకోలీ తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఎందుకంటే బ్రకోలీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వింటర్ సీజన్‌లో బ్రొకోలీని తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎందుకంటే బ్రకోలీలో ఐరన్, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. సోడియం, విటమిన్ సి వంటి మూలకాలు కనిపిస్తాయి. ఇవి శీతాకాలంలో అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడతాయి. బరువు తగ్గేందుకు.. చలికాలంలో బరువు తగ్గాలంటే బ్రోకలీ తీసుకోవాలి.

ఎందుకంటే బ్రోకలీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎముకలకు మంచిది..చలికాలంలో బ్రొకోలీ తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే బ్రోకలీలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా చేస్తుంది. ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి బలంగా..శీతాకాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. కానీ, మీరు శీతాకాలంలో బ్రకోలీని తీసుకుంటే, అది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఎందుకంటే బ్రకోలీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

ఇది వైరస్, బ్యాక్టీరియా నుంచి మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. కాలేయానికి ప్రయోజనకరం..చలికాలంలో బ్రకోలీ తీసుకోవడం వల్ల కాలేయానికి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే బ్రకోలీ తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య తొలగిపోతుంది. అలాగే బ్రోకలీ శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.

కాలేయ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. గుండెకు ప్రయోజనకరం..వింటర్ సీజన్‌లో బ్రకోలీని తీసుకోవడం వల్ల గుండెకు చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే బ్రోకలీలో పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ..ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో బ్రోకలీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే బ్రోకలీలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker