News

హిమాలయాల్లో బైక్ రైడింగ్ చేస్తున్న బాలయ్య కూతురు.

హిమాలయాల్లో బైక్ రైడింగ్ చేయడమంటే అందరకీ ఇష్టమే. కాకుంటే ఎక్కువుగా యువకులే ఈ విషయంలో ప్యాషనేట్‌గా ఉంటారు. అలా అని మహిళలు ఉండరనేం కాదు. ఉంటారు. కాకపోతే పురుషులతో పోలిస్తే చాలా తక్కువ. అలాంటి ప్యాషనేట్ బైక్ రైడర్స్‌లో నారా బ్రాహ్మణి ఒకరు. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. అయితే నందమూరి బాలకృష్ణ కూతురు నారా బ్రాహ్మణి తాజాగా బైక్ ట్రావెలర్‌గా తాను చేసిన అడ్వెంచర్ల గురించి చెప్పుకొచ్చారు. తాను లేహ్ ప్రాంతానికి వెళ్లినట్టుగా, తాను చేసిన బైక్ రైడింగ్ గురించి చెప్పుకొచ్చారు.

ఉదయం పూట ఇక్కడి నుంచి బయల్దేరామని థిక్సే మాంటెస్సరీకి బయల్దేరామని, అక్కడే టిఫిన్, మెడిటేషన్ కూడా చేయాల్సి ఉందని చెప్పుకొచ్చాడు. ఇక ఈమె ఈ స్పిరిట్యువల్ ఎక్స్ పీరియెన్స్ జర్నీ గురించి చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. నారా బ్రాహ్మణికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ జనాలు ఆశ్చర్యపోతోన్నారు. ఎంతైనా నారా బ్రాహ్మణి గ్రేట్ అంటూ పొగిడేస్తున్నారు.

ఇక వదినమ్మ ధైర్య సాహసాలు చూడండి అంటూ తెలుగు దేశం తమ్ముల్లు అయితే ఫిదా అవుతున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో మాత్రం నారా బ్రహ్మణి హాట్ టాపిక్ అయింది. నారా ఫ్యామిలీ మీద సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోల్స్ వస్తుంటాయో అందరికీ తెలిసిందే. నారా లోకేష్‌, బ్రాహ్మణిలను ఎంతగా ట్రోల్స్ చేస్తారో తెలిసిందే. అయితే బ్రాహ్మణి మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో వార్తగా నిలవలేదు.

ఎవరేమన్నా, ఎంతగా ట్రోల్స్ చేసినా కూడా పట్టించుకోదు. తన పని ఏంటో తాను చూసుకుంటూ ఉంటుంది. హెరిటేజ్ సంస్థల బాధ్యతలను ఎంతో సమర్థవంతంగా నిర్వర్తిస్తుంటుంది. మహిళా వ్యాపారవేత్తగా బ్రాహ్మణి సక్సస్‌ అయింది. ఇప్పుడు ఇలా తనలోని కొత్త కోణాన్ని చూపించింది. ట్రావెలర్‌గా బ్రాహ్మణి లుక్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker