Health

అప్పుడప్పుడు ఊపిరి ఆడట్లేదా..? వంటనే ఈ పనులు చెయ్యండి, లేదంటే మీ ప్రాణాలకు ప్రమాదం.

ఆరోగ్య సమస్యలకు చెక్‌ పెట్టడానికీ శ్వాస వ్యాయమాలు హెల్ప్ చేస్తాయి. డీప్‌ బ్రీత్‌ ఎక్స్‌ర్‌సైజ్‌లు నాడీ వ్యవస్థను చురుగ్గా చేస్తాయి. ఇవి ఒత్తిడి నుంచి మనల్ని బయటపడేసి శరీరం, మనస్సును శాంతపరచడానికి సహాయపడతాయి. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, శరీరానికంతటికీ ఆక్సిజన్ సక్రమంగా అందేలా చేస్తాయి. రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి, హృదయ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అయితే నిటారుగా కూర్చోవడం.. శ్వాస ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే నెమ్మదిగా నేరుగా కూర్చోవాలి. ఇది ఊపిరితిత్తులకు విశ్రాంతి ఇచ్చి శ్వాస ప్రక్రియను మెరుగుపరుస్తుంది. లోతుగా శ్వాస తీసుకోవడం.. నెమ్మదిగా, దీర్ఘంగా శ్వాస తీసుకుని అదే విధంగా మెల్లగా వదిలేయండి. ఇది శ్వాస తీసుకోవడాన్ని సుగమం చేస్తుంది. నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచుతుంది. గోరువెచ్చటి నీరు తాగడం.. శరీరంలోని చలిని తగ్గించడంలో గోరువెచ్చటి నీరు మంచి సహాయంగా ఉంటుంది.

ఇది శ్లేష్మాన్ని కరిగించి ఊపిరితిత్తులకు ఉపశమనం కలిగిస్తుంది. గాలి ప్రసరణ ఉన్న ప్రదేశంలో ఉండండి.. తాజా గాలి అందే ప్రదేశంలో ఉండటం వల్ల శ్వాస తీసుకోవడం సులభంగా మారుతుంది. మూసివున్న గదుల్లో ఉండటం వల్ల మరింత అసౌకర్యం కలగవచ్చు. ఒత్తిడిని తగ్గించడానికి చల్లటి నీటితో ముఖాన్ని కడగడం మంచిది. ఇది శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేసి మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది.

అవసరమైతే ఇన్హేలర్ వాడండి.. ఆస్తమా లేదా ఇతర శ్వాస సంబంధమైన సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచనల ప్రకారం ఇన్హేలర్ వాడాలి. ఇది తక్షణ ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. ఇంటి పరిష్కారాలతోనూ ఉపశమనం లేకపోతే.. అసలు కారణం అలర్జీ, గుండె సంబంధిత సమస్య లేదా శ్వాసనాళాల లోపమేనా అని నిర్ధారించడానికి వైద్యుడిని వెంటనే సంప్రదించాలి. ఆలస్యం ప్రాణాంతకంగా మారవచ్చు.

Related Articles

Back to top button

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker