అప్పుడప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందా..? వెంటనే ఏం చెయ్యాలంటే..?
కొన్నిసార్లు ముక్కుదిబ్బడ లేదా తీవ్రమైన వ్యాయామం కారణంగా తేలికపాటి శ్వాస సమస్యలను కలిగి ఉండవచ్చు. కానీ శ్వాస ఆడకపోవడం కూడా తీవ్రమైన వ్యాధికి సంకేతం అని వైద్య నిపుణులు చెపుతున్నారు. అనేక పరిస్థితులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తాయి, అయితే ఊపిరి ఆడకపోవడానికి, శ్వాస ఆడకపోవడానికి మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రస్తుతం చాలా మందిలో ఆడేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా వాలుపై పైకి ఎక్కేటప్పుడు ఊపిరి ఆడకపోవడం జరుగుతుంది.
కానీ అప్పుడప్పుడు కొన్ని కారణాల వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్య ఉంటే.. అది ఏదైనా వ్యాధికి దారి తీసే అవకాశం ఉంది. అయితే చాలా మందిలో శరీరంలో అవసరమైన పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. శరీరంలో విటమిన్ డి లోపం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావడం విశేషం. అయితే విటమిన్ డి లోపానికి అతి పెద్ద కారణం శరీరానికి అవసరమైన పలు ఆహారాలు తీసుకోకపోవడమేనని నిపుణులు తెలుపుతున్నారు. అయితే సూర్యరశ్మి శరీరానికి తగలకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి.
కాబట్టి సూర్యరశ్మి ముందు 5 నిమిషాల పాటు ఉండడం చాలా మంచిది. విటమిన్ డి లోపం వల్ల ఉత్పన్నమయ్యే లక్షణాలు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంది. కండరాలలో బలహీనత అనుభూతి చెందుతుంది. బలహీనమైన ఎముకలు, శరీర నొప్పి. ఎముకల సాంద్రత తక్కువగా ఉండటం, కీళ్లలో నొప్పి. గాయం నయం కావడానికి ఎక్కువ సమయం పట్టడం. పిల్లలలో దంతాల సమస్యలు. విటమిన్ డి మూలాలు.. విటమిన్ డి లోపాన్ని నియంత్రించడానికి శరీరాన్ని సూర్యరశ్మి ముందు ఉంచుకోండి. కాబట్టి రోజూ కనీసం 15 నిమిషాల పాటు ఎండలో నిలబడండి.
గుడ్లలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ డి అధిక పరిమాణంలో ఉంటుంది. కాబట్టి ఈ లోపంతో బాధపడుతున్నవారు రోజూ 2 గుడ్లు తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. మష్రూమ్‌లో కూడా శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి వీటిని తరచుగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఇందులో విటమిన్ డి కూడా అధిక పరిమాణంలో ఉంటుంది. విటమిన్ డి పొందడానికి సాల్మన్ ఫిష్ కూడా తీసుకోవచ్చు. ఇందులో శరీరాన్ని దృఢంగా చేసే మూలకాలు ఉంటాయి.