తెల్ల షుగర్ కన్నా బ్రౌన్ షుగర్ ఆరోగ్యానికి చాలా మంచిది, ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే..?

బ్రౌన్ షుగర్ ఊబకాయాన్ని నివారిస్తుందని మీరెప్పుడైనా అనుకున్నారా? నిజానికి, బ్రౌన్ షుగర్ మీ ఆరోగ్యానికి చాలామంచిదిగా పరిగణించబడుతుంది, ఎందుకంటే తెల్లని పంచదార కన్నా ఇందులో తక్కువగా క్యాలరీలు వుండడం వల్ల ఊబకాయాన్ని నివారించడానికి సహాయపడుతుంది. అయితే బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ ట్రబుల్, ఆస్తమా లాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలన్నా, ఇప్పటికే అలాంటి అనారోగ్యాలు ఉన్నవాళ్లు వాటిని అదుపులో పెట్టుకోవాలన్నా బ్రౌన్ కలర్ రైస్, బ్రౌన్ కలర్ బ్రెడ్ లాంటివి ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజాగా బ్రౌన్ కలర్ షుగర్ ను కూడా వైద్య నిపుణులు రిఫర్ చేస్తున్నారు. వైట్ షుగర్ కంటే బ్రౌన్ రంగు షుగర్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేగాక వైట్ షుగర్ ఎక్కువగా తీసుకోవడంవల్ల కేలరీలు పెరుగుతాయి. దానివల్ల బరువు కూడా పెరిగే ప్రమాదం ఉంది. కానీ, బ్రౌన్ షుగర్‌ను చెరుకు నుంచి కాకుండా నేరుగా బెల్లం నుంచి సేకరిస్తారు. అందుకే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
బ్రౌన్ షుగర్‌లో పొటాషియం, జింక్, రాగి, భాస్వరం, విటమిన్ బి-6 వంటి పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి మంచివి. బ్రౌన్ షుగర్ తీసుకోవడంవల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. దాంతో మలబద్దకం సమస్య కూడా తీరుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అల్లం ముక్క, ఒక టీస్పూన్ బ్రౌన్ షుగర్ కలిపి తీసుకోవాలి. అదేవిధంగా కాళ్లు, చేతుల్లో తిమ్మిర్లను తగ్గించడానికి బ్రౌన్ షుగర్ సహాయపడుతుంది.
ఇందులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి తిమ్మిర్లతోపాటు నొప్పిని తగ్గిస్తుంది. బ్రౌన్ షుగర్‌లో కేలరీలు తక్కువగా ఉండటంవల్ల బరువు తగ్గడానికి కూడా తోడ్పడుతుంది. అలాగే జీవక్రియలను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా బ్రౌన్ షుగర్‌లో విటమిన్ బి6, నియాసిన్, పాంతోతెనిక్ ఆమ్లం, ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
ఇవి చర్మం కోసం యాంటీ ఏజింగ్ కాంపోనెంట్గా పనిచేస్తాయి. అలాగే చర్మంపై మృత కణాలను తొలగించే స్క్రబ్‌గా పనిచేస్తాయి. బ్రౌన్ షుగర్ యాంటీ అలర్జీ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. అందుకే ఇది ఉబ్బసం రోగులకు చికిత్సలో సాయపడుతుంది. బ్రౌన్ షుగర్ బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి తోడ్పడే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది.