క్యాన్సర్ బారిన ఆటో రామ్ ప్రసాద్, కీలక విషయాలు చెప్పిన కమెడియన్.

సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి వెళ్లిపోవడంతో ప్రస్తుతం గెటప్ శ్రీనుతో కలిసి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు రాం ప్రసాద్. కాగా ఇటీవల ఈ స్టార్ కమెడియన్‌పై కొన్ని పుకార్లు హల్‌చల్ చేస్తున్నాయి. రాంప్రసాద్ అనారోగ్యం బారిన పడ్డారంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. తలకు సర్జరీ జరిగిందని నెట్టింట పుకార్లు హల్‌చల్ చేశాయి. దీనికి తోడు జబర్దస్త్ వేదికపైనా, బయటా క్యాప్ పెట్టుకొని కనిపించడంతో రాంప్రసాద్ కి క్యాన్సర్ అంటూ కథనాలు బయటికు వచ్చేశాయి.

వీటికి సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే కమెడియన్, నటుడు ఆటో రాంప్రసాద్ అరోగ్యం గురించి గత కొద్ది రోజులుగా పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య రామ్ ప్రసాద్ ఆస్పత్రి చికిత్స తీసుకుంటున్న ఫొటో ఒకటి లీకైంది. ఇందులో అతడు సర్జికల్ క్యాప్ పెట్టుకుని కనిపంచాడు. దీంతో రాంప్రసాద్ క్యాన్సర్ బారిన పడ్డాడని, ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నాడంటూ జోరుగా ప్రచారం జరిగింది.

అంతేకాదు అతడు త్వరగా కోలుకోవాలని ఫాలోవర్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే తాజాగా తన అరోగ్యంపై వస్తున్న పుకార్లపై రాంప్రసాద్ స్పందించాడు. కమెడియన్ కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ రెండో బ్రాంచ్‌ను మణికొండలో ప్రారంభించాడు. ఈ ప్రారంభోత్సవంలో పలువురు జబర్దస్త్ షో నటులు పాల్గొన్నారు. అందులో హైపర్ ఆది, గెటప్ శ్రీను, రాంప్రసాద్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాంప్రసాద్‌ను తన ఆరోగ్యంపై ప్రశ్నించగా.. అది నిజం కాదని స్పష్టం చేశాడు.

‘నాకు క్యాన్సర్ అంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. నేను తలకు క్యాప్ పెట్టుకోవడంతో అంతా నాకేదో అయ్యిందని ఆందోళన పడ్డారు. నాకు ఏం కాలేదు. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నాను. అందుకే క్యాప్ పెట్టుకున్నా. అంతే నాకేం కాలేదు. నాకేదైనా అయితే చూసుకోవడానికి మీరు ఉన్నారుగా’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

గతేడాది నవంబర్ రాంప్రసాద్ తలకు సర్జరీ క్యాప్ పెట్టుకుని ఆస్పత్రిలో దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది చూసి రాం ప్రసాద్‌కు ఏమైందీ, ఎందుకు క్యాప్ పెట్టుకున్నాడంటూ ఆరా తీశారు. ఈ నేపథ్యంలో అతడు క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్నాడని, గుండు కావడంతో క్యాప్ పెట్టుకున్నాడంటూ పుకార్లు గుప్పుమన్నాయి. కాగా బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ షోలో తనదైన కామెడీ, ఆటో పంచులతో రాంప్రసాద్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.